పన్నెండు దిర్హములు

మంగళ, 08/07/2018 - 09:07

మన మంచి ఆలోచనే మనకు అనుగ్రహాలు తెచ్చిపెడుతుంది అన్న విషయం ప్రతీ ఒక్కరూ గ్రిహించాలి.

12 దిర్హములు

దైవప్రవక్త[అ.స] అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]ను బజారుకెళ్ళి చొక్కా కొనుక్కొని రమ్మని పంపారు. వారు వెళ్ళి 12 దిర్హముల చొక్కను కొనుకొచ్చారు. దైవప్రవక్త[స.అ] ఎంతక్కొన్నావు? అని అడిగారు. 12 దిర్హములు అన్నారు. దైవప్రవక్త[స.అ], నాకు అంతగా ఇష్టంలేదు, తక్కువ ధర చొక్కా కావాలి, విక్రేత తిరిగి తీసుకుంటాడా? అని అన్నారు.  తెలియదు దైవప్రవక్తా! అని అలీ[అ.స] బజారుకెళ్ళి విక్రేతతో ఇలా అన్నారు: దైవప్రవక్త[స.అ]కు ఇంతకన్నా తక్కువ ధరలో చొక్కా కావాలి, నీవు ఈ చొక్కని తీసుకొని డబ్బులు తిరిగి ఇవ్వగలవా?. విక్రేత ఒప్పుకొన్నాడు. అలీ[అ.స] డబ్బులు తీసుకొని దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చారు. అప్పుడు ఇద్దరూ కలిసి బజారు వైపుకు వెళ్తుండగా, దారి మధ్యలో దైవప్రవక్త[స.అ] ఒక దాసిని ఏడుస్తూ ఉండడాన్ని చూశారు. దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు? అని ప్రశ్నించారు. ఇంట్లో నాకు 4 దిర్హములు ఇచ్చి బజారుకు పంపించారు కాని ఆ డబ్బులు ఎక్కడ పడిపోయాయో తెలియడం లేదు, తిరిగి ఇంటికెళ్ళే ధైర్యం కూడా నాకులేదు, అని ఆ దాసి అంది. దైవప్రవక్త[స.అ] ఆ 12 దిర్హముల నుండి 4 దిర్హములు ఆమెకు ఇచ్చి కొనాలనుకున్నవి కొనుక్కొని ఇంటికి వెళ్ళు అన్నారు. వారు బజారుకెళ్ళి తన కోసం ఒక చొక్కను కొనుక్కోని ధరించారు. తిరిగి వస్తుండగా ఒక చొక్కా లేనివాడిని చూసి అతడికి ఆ చొక్కా ఇచ్చి మరలా బజారుకి వెళ్ళి 4 దిర్హములతో చొక్కా కొనుకుని ఇంటికి తిరిగి వస్తుండగా. దారి మధ్యలో ఆ దాసి కలవరపడుతూ కంగారుగా కనిపించింది, ఇంటికెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. ఓ దైవప్రవక్తా[స.అ] చాలా ఆలస్యమైయ్యింది, ఎందుకు ఆలస్యం చేశావు అని కొడతారేమోనని భయమేస్తుంది, అని అంది. రా, నీతో నీ ఇంటి వరకు నేను కూడా వస్తాను. ఎవ్వరూ ఏమి అనకుండా నేను వారితో మాట్లాడతాను. దైవప్రవక్త[స.అ] ఆమెతో పాటు ఆమె ఇంటికి చేరారు. తలుపు దగ్గర నిలబడి ఇలా అన్నారు: “ఇంట్లో ఉన్నవారికి సలామున్ అలైకుం” ఎవ్వరూ జవాబివ్వలేదు. రెండవ సారి సలామ్ చేశారు, సమాధానం రాలేదు. మూడవ సారి సలామ్ చేశారు. “అస్సలాము అలైక యా రసూలల్లాహ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్” అని జవాబిచ్చారు. ఎందుకు ముందుగా జవాబివ్వలేదు, నా పిలుపు వినబడలేదా? అని దైవప్రవక్త[స.అ] వారిని అడిగారు. మొదటి సారికే వినబడింది, మరి మీరే అని తెలుసుకున్నాము కూడాను. అయితే ఆలస్యం ఎందుకు చేశారు అని దైవప్రవక్త[స.అ] అడిగారు. ఓ దైవప్రవక్తా! మీ సలామును మరలా మరలా వినాలని, మీ సలామ్ మా ఇంటి పై కారుణ్యం, దయా మరియు ఆరోగ్యానికి కారణం.
మీ దాసికి రావడంలో ఆలశ్యమైయ్యింది, మీరు ఆమెను దండించకండి, అని చెప్పడానికి వచ్చాను అని దైవప్రవక్త[స.అ] అన్నారు. ఓ దైవప్రవక్తా! మీ పవిత్ర పాదముల రాకతో, ఈ దాసి ఆ సమయంలోనే బానిసత్వం నుండి స్వాతంత్ర్యం పొందింది. దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “అల్ హందులిల్లాహ్, ఎంతమంచి 12 దిర్హములు, ఇద్దరికి ధరించేందుకు దుస్తులు మరియు ఒక బానిసను స్వచ్ఛను కలిపించాయి”.[బిహారుల్ అన్వార్, భాగం6, బాబొ మకారిము అఖ్లాఖిహి వ సియరిహి వ సుననిహి]

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుల్ అహ్యా, బేరూత్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9