మీరు ఎన్ని కష్టాలకు గురి అయినా సరే, ఒకరి ముందు మొరపెట్టుకోకండి, ఒకరు తన కష్టాలను చెప్పక ముందే మీ స్థాయికి తగ్గ సహాయం చేయడం మరవకండి.

“ముఫజ్జల్ ఇబ్నె ఖైస్”, అతడి రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయి. ఖర్చులు, అప్పులు దరిద్రం అతడిని పీడిస్తున్నాయి. ఒకరోజు ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] వద్దకు వచ్చి తన కష్టాలను ఇలా మొరపెట్టుకున్నాడు: ఇంత అప్పుంది ఎలా తీర్చాలో తెలియదు, అంత ఖర్చుంది రాబడి లేదు, ఏమిచేయాలో అర్ధం కావడం లేదు, తలుపులన్నీ మూసుకుపోయాయి..., చివరిలో ఇమామ్ ను అల్లాహ్ తన కష్టాలను దూరం చేయమని దుఆ చేయమని కోరాడు. ఇమామ్ అక్కడున్న తన దాసితో వెళ్ళి ‘మన్సూర్’ పంపిన ఆ నాణ్యముల సంచిని తీసుకొని రమ్మని అన్నారు. ఆ దాసి వెళ్ళి వెంటనే ఆ సంచిని తీసుకొచ్చింది. అప్పుడు ఆ సంచిని ‘ముఫజ్జల్ ఇబ్నె ఖైస్’ కు ఇచ్చి ఇలా అన్నారు: ఇందులో 400 దీనారులు ఉన్నాయి ఇవి నీకు సహాయపడతాయి ఉంచుకో. మీకు చెప్పింది ఇందు కోసం కాదు, కేవలం దుఆ చేస్తారనే ఆశతో మాత్రమే, అని అతడన్నాడు. తప్పకుండా, దుఆ కూడా చేస్తాను. కాని నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, కష్టాలను మరియు నిస్సహాయాన్ని ప్రజల ముందు వివరించకు, దాని వల్ల నీవు జీవితం అనే మైదానంలో ఓడిపోయావని అనిపిస్తుంది, కాలాన్ని జయించలేకపోయావని అనిపిస్తుంది, ప్రజలు తక్కువ చేసి చూస్తారు, నీ ఉనికీ గౌరవం పోతుంది.[బిహారుల్ అన్వార్, భాగం11, పేజీ114].
మీరు ఎన్ని కష్టాలకు గురి అయినా సరే, ఒకరి ముందు మొరపెట్టుకోకండి, దాంతో మీలో ఉన్న మనోబలం తరుగుతుంది, ఆత్మగౌరవం మెల్లమెల్లగా మీ నుండి పొతుంది. ఫలితంగా మీరు సిగ్గులేనివారిగా మారిపోతారు. సిగ్గులేనితనం ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తుంది. ఒకరు తన కష్టాలను చెప్పక ముందే మీ స్థాయికి తగ్గ సహాయం చేయడం మరవకండి, దాంతో ఎదుటివారి ఆత్మగౌరవాన్ని కాపాడినవారవుతారు మరియు సమాజాన్ని కాపాడినవారవుతారు.
రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుల్ అహ్యా, బేరూత్.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... jazakallah.
Mashaallah
Shukriya...Iltemase dua.
Masha Allah jazakallah
Shukriya... Iltemase dua..
వ్యాఖ్యానించండి