ఖుర్బానీ సంఘటన ఖుర్ఆన్ లో

శని, 08/18/2018 - 07:07

ఖుర్బానీ సంఘటన అల్లాహ్ తన గ్రంథం ఖుర్ఆన్ యొక్క సాఫ్ఫాత్ సూరహ్ లోని ఆయత్ 101 నుండి 108 వరకు ప్రవచించెను.

ఖుర్బానీ సంఘటన ఖుర్ఆన్ లో

హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] యొక్క జీవిత ముఖ్య అధ్యాయముల నుండి చాలా రహస్యాలు కలిగి ఉన్న అధ్యాయం, ఖుర్బానీ మరియు తన కుమరుడు హజ్రత్ ఇస్మాయీల్ ను బలిచ్చిన అధ్యాయం. ఈ సంఘటననే అల్లాహ్ తన గ్రంథం ఖుర్ఆన్ యొక్క సాఫ్ఫాత్ సూరహ్ లోని ఆయత్ 101 నుండి 108 వరకు ప్రవచించెను.
ఖుర్ఆన్: “మేము అతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించి శుభవార్తను అందజేశాము”[సాఫ్ఫాత్:101]. అల్లాహ్ ఇస్మాయీల్[అ.స] యొక్క ‘జిబహ్’ సంఘటనను చెప్పాలనుకుంటున్నాడు అందుకనే వారి యొక్క సహనశీలత్వ గుణాన్ని ఆయత్ లో సూచించాడు.
ఖుర్ఆన్: మరి ఆ కుర్రాడు(ఇస్మాయీల్) అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “నా ప్రియ కుమారా! నేను నిన్ను ‘జిబహ్’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను(ఇబ్రాహీమ్) అన్నారు. “నాన్న గారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.
అన్ని సిద్ధం చేసుకున్న తరువాత ఇబ్రాహీమ్[అ.స] అల్లాహ్ అజ్ఞానుసారం తన కుమారుడు ఇస్మాయీల్[] ను ‘జిబహ్’ చేయాలనుకున్నరు, కత్తిని ఇస్మాయీల్ గొంతు పై పెట్టారు కాని ఎంత ప్రయత్నించినా కత్తి కోయడం లేదు! బహుశ కత్తి పదునుగా లేదేమో అని పరీక్షించారు, అది చాలా పదునుగా ఉంది. మరలా కత్తిని ఇస్మాయీల్ గొంతు పై పెట్టారు, ఈ సారి కూడా కత్తి తన ప్రభావం చూపలేదు. హజ్రత్ ఇబ్రాహీమ్ కత్తిని ఉద్దేశించి “ఎందుకు నా ప్రభువు ఆజ్ఞను అనుసరించనివ్వడం లేదు?” అని అన్నారు.
అప్పుడు కత్తి ఇలా చెప్పింది: “الخلیل یأمرنى والجلیل ینهانى” అనువాదం: “ఖలీల్(ఇబ్రాహీమ్) నన్ను (కోయమని) ఆదేశిస్తున్నాడు, జలీల్(అల్లాహ్) ఆ పని నుండి ఆపుతున్నాడు.[అత్యబుల్ బయాన్, భాగం10, పేజీ231., భాగం11, పేజీ56 మరియు 178].  
ఆ సమయంలో దైవదూత అల్లాహ్ తరపు నుండి అవతరించి వారిని అల్లాహ్ యొక్క నిర్ణయాన్ని తెలియపరిచాడు.

రిఫ్రెన్స్
అబ్దుల్ హుసైన్ తయ్యబ్, అత్యబుల్ బయాన్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్, నాషిర్ ఇస్లాం, తెహ్రాన్, 1378.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

“الخلیل یأمرنى والجلیل ینهانى”

Subhanallah

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19