ఇమామ్ అలీ[అ.స] కుమారుల సంస్కారం

గురు, 08/23/2018 - 06:22

ఇమామ్ అలీ[అ.స] కుమారులైన ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స] సంస్కారం ఉజూను సర్ధిచెప్పే విషయంలో.

ఇమామ్ అలీ[అ.స] కుమారుల సంస్కారం

ఒక ముసలివాడు ఉౙు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు, కాని అతడికి సరిగా ఉౙు చేసుకోవడం రాదు. ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స], అప్పుడు వారిద్దరి వయసు చిన్న వయసు, వారు ఆ ముసలివాడు ఉౙు చేయడాన్ని చూశారు. అతడికి సరైన ఉౙుకు అవసరమైన అంశాలే తెలియవు అన్న విషయం గ్రహించీ, ఎలాగైనా సరే అతడికి సరైన ఉౙు నేర్పాలీ అని అనుకున్నారు. కాని నేరుగా అతడికి “మీ చేస్తున్న ఉౙు పద్ధతి తప్పు” అని చెబితే అతడికి నిరాశ పరచడం ప్రక్కన పెడితే అతడికి ఈ సంఘటన జీవితాంతం ఒక చేదు సంఘటనగా మిగిలిపోతుంది. అంతేకాకుండా అతడు మా మాటలను అతడికి కించపరచడానికే అని అనుకోడని ఏమిటి నమ్మకం! ఒక్కసారిగా అతడు మొండిగా మన మాటలను ఒప్పుకోకుండా అలాగే ఉండిపోతే! అని ఆలోచించి ఆ ఇద్దరూ నేరుగా కాకుండా ఇంకో విధంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వారిద్దరూ ఆ ముసలివాడికి వినబడే విధంగా ఇలా సంభాషించుకున్నారు., వారిద్దరిలో ఒకరు ఇలా అన్నారు: “నా ఉౙు, నీ ఉౙు కన్న సంపూర్ణమైనది” మరోకరు: “నా ఉౙు, నీ ఉౙు కన్న సంపూర్ణమైనది” ఆ తరువాత వారిద్దరూ ఆ పెద్దమనిషి ముందు అతడు చూస్తుండగా ఉౙు చేయాలి, మరి అతడే మన మధ్య ఎవరి ఉౙు సరైనదో తీర్మానిస్తారనే ఒక అభిప్రాయానికి ఇద్దరూ సమ్మతించుకున్నారు. వారిద్దరూ కూడా ఉౙును సరిగా మరియు సంపూర్ణంగా ఆ ముసలివాడి ముందు చేశారు. అప్పుడు అతడికి సరైన ఉౙు ఎలా చేయాలో తెలిసొచ్చింది, మరి వారిద్దరి మంచి ఉద్దేశాన్ని గ్రహించాడు, వారి కల్మషం లేని ప్రేమ, బుద్ధివివేకాలతో ముగ్దుడయ్యి ఇలా అన్నాడు: “మీరిద్దరు చేసిన ఉౙు సరైనది మరియు సంపూర్ణమైనది. ఈ ముసలివాడే అజ్ఞాని, ఇప్పటికీ ఉౙు చేయడం తెలుసుకోలేదు. మీ పితామహుని ఉమ్మత్ పట్ల మీ ప్రేమ వల్ల నన్ను తెలియపరిచారు, నేను మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను”[బిహారుల్ అన్వార్, భాగం10, పేజీ89].

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, చాప్ తబ్రీజ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16