ముసలి క్రైస్తవుడు

గురు, 08/23/2018 - 07:28

న్యాయధర్మాలను పాటించడానికి మతవర్గాలు అడ్డు రాకూడదు అన్న విషయం పై పవిత్ర ఇమామ్ యొక్క ఈ నిర్ణయమే నిదర్శనం.

ముసలి క్రైస్తవుడు

ముసలి క్రైస్తవుడు, చాలా కాలం పని చేశాడు, అతని వెనక జీవితం గడపడానికి ఆస్తేమీ లేదు, చివరి రోజులలో అంధుడు కూడా అయ్యాడు. వృధ్యాపం, లేనితనం మరియు అంధత్వం అన్నీ ఒకేచోట చేరడంతో అతడికి అడుక్కోవడం తప్ప వేరే దారి కనిపించలేదు, గల్లీ చివర నిలబడి అడుక్కునేవాడు. ప్రజలు అతడి పై దయతో దానం చేసేవారు. అతడికి చావకుండా బ్రతికి ఉండేంత దానం లభించేది, దాంతోనే తన జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] అక్కడ నుండి వెళ్తూ అతడి పరిస్థితిని గమనించారు. ఇమామ్ అలీ[అ.స], అతడు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు అన్న విషయం పై అతడి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఇతడిని చూసుకునేందుకు సంతానం ఉందా?, ఈ మసలివాడు తన చివరిరోజులు ఇలా అడుక్కోకుండా గౌరవమైన జీవితాన్ని గడపడానికి వేరే మార్గమేమైనా ఉందా?, అని చూడమని ఆదేశించారు. అతడు తెలిసిన వ్యక్తులు వచ్చి “ఈ మసలివాడు ఒక క్రైస్తవుడు, యువకుడిగా మరియు కళ్ళు కనిపించినంత కాలం కూలి చేసుకునే వాడు, ఇక ఇప్పుడు వృద్ధుడు మరియు అంధుడు కావడంతో పని చేయలేకపోతున్నాడు, వెనక ఆస్తి కూడా లేదు, ఇక అడుక్కోవడమే అతిడికి మిగిలిన దారి. ఇమామ్ అలీ[అ.స] ఇలా అన్నారు: “ఆశ్చర్యం! అతడు బలంగా ఉన్నప్పుడు అతడితో పనులు చేయించుకున్నారు, మరి ఇప్పుడు గాలికి వదిలేశారా?! ఇతడి పూర్వం ద్వార తెలిసే విషయమేమిటంటే ఇతడు శక్తి ఉన్నంత కాలం పని చేశాడు, ప్రజలకు సేవ చేశాడు. అందుకని ఇతడు ప్రాణాలతో ఉన్నంత కాలం ఇతడి బాధ్యత ప్రభుత్వం మరియు ప్రజలదే, వెళ్ళండి వెళ్ళి ‘బైతుల్ మాల్’ (ఇస్లాం ధనాగారం) నుండి అతడికి సహాయం చేయండి”[వసాయిల్ అల్ షియా, భాగం2, పేజీ425]

రిఫ్రెన్స్
హుర్రెఆములి, వసాయిల్ అల్ షియా, ముఅస్ససతు ఆలుల్ బైత్ అలైహిముస్సలామ్ లి అహ్యాయిత్తురాస్, ఖుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

Jazakallah
Thanks to wilayat team for brief the Ruling of Imama Ali a.s....
Please update many more ruling points of Moula Ali as Khilafat.
Thanks.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14