కిటికీ మరియు అద్దం

ఆది, 08/26/2018 - 11:18

కిటికీలకు ఉండే అద్దం మరియు ముఖం చూసుకునే అద్దం రెండు గాజుతో చేసినవే కాని ఒక చిన్న తేడా వల్ల ఒక దాని నుండి అందరూ కనబడతారు కాని ఒక దానిలో కేవలం మనకు మనమే కనబడతాము.

కిటికీ మరియు అద్దం

ధనవంతుడైన ఒక యువకుడు, ఒక ఆలిమ్ వద్దకు వెళ్లి అతనిని మంచి జీవితం కోసం సద్బోధించమని కోరాడు. ఆ జ్ఞాని అతడిని ఒక కిటికీ వద్దకు తీసుకొని వెళ్ళి “కిటికీ వెనక నీకేమి కనిపిస్తుంది?” అని అడిగారు. “వచ్చీపోయే మనుషులు, యాచకులు, నిస్సాయులు” కనిపిస్తున్నారు అని సమాధానమిచ్చాడు” ఆ తరువాత ఒక పెద్ద అద్దం ముందుకు తీసుకొని వెళ్ళి “ఈ అద్ధంలో చూసి చెప్పు నీకేమి కనిపుస్తుంది” అని అడిగారు. “నన్ను నేనే చూస్తున్నాను” అని అన్నాడు. అయితే ఇక వేరే ఎవరు కనబడడం లేదన్నమాట! ఆ కిటికీ మరియు అద్ధం రెండు కూడా ఒకే మెటీరియల్ ద్వార చెయబడినవి, రెండూ సీసముతోనే తయారు చేబడినవి. కాని అద్దం వెనక ఒక సన్నటి వెండి పొర ఉంటుంది దాని వల్ల అందులో నీవు తప్ప మరెవ్వరూ కనిపించరు. ఈ రెండింటిని పోల్చి చూడు. గాజు వెనక వెండి పొర ఉంటే ఇతరులు కనబడరు, కేవలం మనకు మేమే కనబడతాము. అదే వెండి పొర(ధనం) మనుషుల వెనక ఉంటే వారికి వారు తప్ప మరెవ్వరూ కనిపించరు. కళ్ళున్నా ఎదుటివారు కనిపించని పరిస్థితి. ఎదుటివారి ప్రేమానురాగాలు కనిపించవు.
ఆ వెండిపొరను మీ కళ్ళ పైనుండి తీసి ఎదుటివారిని ప్రేమించినప్పుడే, గౌరవించినప్పుడే మీకూ విలువ ఉంటుంది.       

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12