దైవప్రవక్త[స.అ] యొక్క 10వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ నఖీ[అ.స] దృష్టిలో మృత్యువు ఉపమానం.
ఇమామ్ అలీ నఖీ[అ.స] యొక్క అనుచరుల నుండి ఒకడు, తన చివరి గడియాలు అని తెలిసిన తరువాత మృత్యువు పట్ల అతడికి భయమెక్కువయ్యింది. ఇమామ్ అతడిని చూడడానికై వెళ్ళారు, అతడిని ఆ స్థితిలో చూసి ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ దాసుడా! మృత్యువు గురించి తెలియక నీవు దాని నుండి భయపడుతున్నావు!.
ఒకవేళ నీ శరీరం పై ఎదైనా మురికి లేదా గాయం ఉంటే స్నానానికి వెళ్ళి ఆ మురికిని మరియు ఆ గాయాలను శుభ్రంగా కడుక్కుంటావా లేదా?
అతడు, “ఔను ప్రవక్త కుమారా!” అన్నాడు.
అప్పుడు ఇమామ్ ఇలా అన్నారు: “మృత్యవు కూడా స్నానం లాంటిదే. ఎందుకంటే దీనిని దాటితే అన్ని కష్టాల నుండి బయటపడతావు మరి నీవు వేచిచూస్తున్న సంతోషాలకు చేరుతావు”[షిగిఫ్తీహాయే ఆలమె బర్జఖ్, పేజీ14].
రిఫ్రెన్స్
గజంఫర్ అలీ, షిగిఫ్తీహాయే ఆలమె బర్జఖ్, నీలూఫరానెహ్, ఖుమ్, ఇరాన్, 1386.
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya ... Jazakallah.
Mashallah
వ్యాఖ్యానించండి