.ఖలీఫాను ఎన్నుకునే అర్హత కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది.
షియా ముస్లిముల దృష్టిలో “ఖిలాఫత్ అల్లాహ్ స్వాధీనంలో ఉంది ఆయన ఎవరిని నియమించమని దైవప్రవక్త(స.అ)పై దైవవాణి ద్వార తెలియపరుస్తాడో దైవప్రవక్త(స.అ)కు కూడా అతనినే ఖలీఫాగా నియమించడం తప్పదు”. మరి ఈ వచనం ఇస్లాం యొక్క ఆదేశాల మరియు ఉపదేశాల ఫిలాసఫీకు అనుకూలమైనది, ఎందుకంటే ఏది కావలంటే అది అల్లాహ్‌యే సృష్టించ గలడు మరియు ఎవరిని పడితే (ఖిలాఫత్ కోసం) వారిని ఎన్నుకుంటాడు. అందులో ప్రజల జోక్యం లేదు[ఖసస్ సూరా:28, ఆయత్:68] అలాగే అల్లాహ్ ఉద్దేశం కూడా ఇదే ముహమ్మద్(స.అ) యొక్క ఉమ్మత్ అన్నీటి కన్న మంచి ఉమ్మత్ కాబట్టి దాని నాయకుడు కూడా ఒక బుద్ధిమంతుడు, విధేయుడు, జ్ఞాని, ధైర్యవంతుడు, వీరుడు, భయభీతి గలవాడు, ధర్మనిష్ఠగల వాడు, పక్కా ఈమాన్ గలవాడు అయి ఉండాలి మరి ఇవన్నీ అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికి తెలియవు అందుకని అల్లాహ్ మాత్రమే అతనిని నియమించగల అర్హత గలవాడు. అల్లాహ్ ఇలా ప్రవచించెను: ٱللَّهُ يَصۡطَفِي مِنَ ٱلۡمَلَٰٓئِكَةِ رُسُلٗا وَمِنَ ٱلنَّاسِۚ إِنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٞ అనువాదం: అల్లాహ్ (తన అహ్కామును అందజేయటానికి) సందేశహరులను దైవదూతల నుండి ఎన్నుకుంటాడు అలాగే మానవుల నుండి కూడా (ఆయనే ఎన్నుకుంటాడు) నిస్సందేహముగా అల్లాహ్ అన్ని వింటాడు, అన్నీ చూస్తాడు[అల్ హజ్జ్:22, ఆయత్:75]
అల్లాహ్, ప్రవక్తలను ఎన్నుకున్నట్లే ఉత్తరాధికారులను కూడా ఎన్నుకుంటాడు, దైవప్రవక్త(స.అ) ప్రవచనం: “ప్రతీ ప్రవక్తకు ఒక ఉత్తరాధికారి ఉంటాడు మరియు నా ఉత్తరాధికారి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)”[తారీఖె ఇబ్నె అసాకిర్, భాగం3, పేజీ5. మనాఖిబే ఖారజ్మీ, పేజీ42. యనాబీవుల్ మవద్దహ్, పేజీ79]
మరియు ఇంకో రివాయత్: “ప్రవక్తల క్రమంలో నేను చివరి వాడిని మరియు ఉత్తరాధికారుల క్రమంలో అలీ(అ.స) చివరి వారు” [యనాబీవుల్ మవద్దహ్, భాగం2, పేజీ3]
రిఫ్రెన్స్
తారీఖె ఇబ్నె అసాకిర్, భాగం3, పేజీ5. మనాఖిబే ఖారజ్మీ, పేజీ42. యనాబీవుల్ మవద్దహ్, పేజీ79. యనాబీవుల్ మవద్దహ్, భాగం2, పేజీ3.
వ్యాఖ్యానించండి