ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం సమ్మతమైన ఉౙూ యొక్క షరత్తులు.
1. నీరు శభ్రంగా ఉండాలి.
2. నీరు “మత్లఖ్” నీరు అయి ఉండాలి.
3. నీరు “ముబాహ్” అయి ఉండాలి. అనుమతి లేని నీరు ఉండకూడదు.
4. ఉౙూ చేసుకునే భాగాలు అనగా ముఖం, చేతులు, తల మరియు కాళ్లు శుభ్రంగా(పాక్) ఉండాలి.
5. నమాజ్ చదివేందుకు సరిపడ సమయం ఉండాలి. ఒకవేళ ఉౙూ చేస్తే నమాజ్ సమయం గడిచిపోతుంది లేదా నమాజ్ యొక్క కొంత భాగం సమయం గడిచిపోయాక చదవవలసివస్తుంది అంటే కూడా ఉౙూకు బదులు తయమ్ముమ్ చేయాలి.
6. అల్లాహ్ సామిప్యం పొందాలనే (ఖుర్బతన్ ఇలల్లాహ్) నియ్యత్ చేయాలి.
7. చెప్పబడ్డ క్రమంలో ఉౙూను చేయాలి అనగా ముందుగా ముఖం ఆ తరువాత కుడి చేయి, ఎడమ చేయి, తల యొక్క మసహ్ ఆ తరువాత కాళ్ళ మసహ్.
8. ఉౙూ మధ్యలో అంతరం రాకుండా చేయాలి.
9. ఉౙూను మనిషి స్వయంగా తానే చేయాలి.
10. ఉౙూ చేసేవాడికి నీరు హానికరం అయి ఉండకూడదు.
11. ఉౙూ చేయబడే శరీరభాగాల పై నీరు చేరకుండా ఏదీ అడ్డుగా ఉండకూడదు.[తౌజీహుల్ మజాయిల్, పేజీ58-63]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి