జనాబత్

ఆది, 09/02/2018 - 07:41

ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం జనాబత్ అంటే ఏమిటి మరియు గుస్ల్ ఎలా చేస్తారు అన్న వివరణ.

జనాబత్

జనాబత్ అనగా శిశ్నము నుండి వీర్యం బయటకు రావడం.
జనాబత్ రెండు రకాలుగా అవుతుంది ఒకటి స్త్రీ సంభోగం ద్వార లేదా వీర్యం బయటకు రావడం ద్వార., అది నిద్రలో కానివ్వండి లేదా మెలుకువలో, తక్కువ కానివ్వండి లేదా ఎక్కువ, కామంతో కానివ్వండి లేదా కామంలేకుండా, తెలిసి రానివ్వండి లేదా తెలియకుండా. ఏదైనా సరే వీర్యం బయటకు రాగానే మనిషి ..గుస్లె జనాబత్.. చేయాలి. చేయనంత వరకు అతడు అపవిత్రుడిగానే ఉంటాడు. వీర్యం బయటకు వచ్చిన తరువాత మూత్రం చేయడం మంచిది(ముస్తహబ్) ఎందుకంటే ఒకవేళ గుస్ల్ తరువాత శిశ్నము నుండి ఏదైన తడి బయటికి వచ్చి అది ఏమిటో తెలియకపోతే అది వీర్యంగా భావించవలసి వస్తుంది. ఆ సమయంలో మరలా గుస్ల్ చేయవలసి వస్తుంది. .[తౌజీహుల్ మజాయిల్, పేజీ72]
గుస్ల్ చేయుపద్దతి: శుభ్రంగా స్నానం చేసుకున్న తరువాత, ముందుగా “గుస్లె జనాబత్ చేస్తున్నాను అల్లాహ్ సామిప్యం కోసం” అని నోటితో చెప్పాలి లేదా మనసులో అనుకోవాలి(నియ్యత్). ఆ తరువాత తల మరియు మెడను కడుక్కోవాలి, ఆ తరువాత శరీరం యొక్క కుడి భాగాన్ని ఆ తరువాత ఎడమ భాగాన్ని కడుక్కోవాలి. దాంతో మీరు మరల జనాబత్ స్థితి నుండి బయటపడతారు.[తౌజీహుల్ మజాయిల్, పేజీ77]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19