దైవప్రవక్త[స.అ] పై కఠినమైన రోజులు

శని, 09/08/2018 - 11:48

చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనాలకు దైవప్రవక్త[స.అ] చాలా బాధ పడ్డారు. వాటిలో వారి హృదయాన్ని చాలా కష్టపెట్టిన మూడు విషయాల వివరణ. 

దైవప్రవక్త[స.అ] పై కఠినమైన రోజులు

ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] ఇలా ప్రవచించారు: “దైవప్రవక్త[స.అ]కు మూడు రోజులు చాలా కష్టంకలిగించాయి: 1. ఒహద్ యుద్ధంలో హజ్రత్ హంౙా[అ.స] మరణించిన రోజు, 2. మౌతహ్ యుద్ధంలో జాఫర్ ఇబ్నె అబీతాలిబ్[అ.స] మరణించిన రోజు, 3. నా తండ్రి ఇమామ్ హుసైన్[అ.స] మరణించిన రోజు. ఆ తరువాత ఇలా అన్నారు: “లా యౌమ క యౌమిల్ హుసైన్” అనువాదం: “ఏ రోజు కూడా హుసైన్ రోజుకు సమానం కాలేదు”[అల్ అమాలీ, పేజీ462].
స్వయంగా ఇమామ్ హసన్[అ.స] కొద్ది సమయంలో తన ప్రాణాలు విడుస్తారన్న సమయంలో అందరూ అతనిని చుట్టుముట్టారు, ఇమామ్ హుసైన్[అ.స] ఏడుస్తున్నారు, అతనితో ఇమామ్ హసన్(అ.స) ఇలా అన్నారు: “లా యౌమ క యౌమిక్” “నీ రోజుతో ఏరోజు సమానం కాదు”[అల్ అమాలీ, పేజీ116].
స్వయంగా ఇతర మాసూములే ఇమామ్ హుసైన్[అ.స] కోసం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. ఇది గ్రహించదగ్గ విషయం.

షేఖ్ సదూఖ్, అల్ అమాలీ, కుమ్రెయి, కితాబ్చీ, తెహ్రాన్, 1376.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29