ముహర్రం మాసం యొక్క సందర్భాలు

శని, 09/08/2018 - 11:59

ముహర్రం నెలతో ఇస్లామీయ హిజ్రీ సంవత్సరం మొదలవుతుంది, అంటే ఇస్లామీయ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ఈ నెలలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు.

ముహర్రం మాసం యొక్క సందర్భాలు

1వ తారీఖు: ఆముల్ ఫీల్ మొదటి సంవత్సరంలో అబ్రహా మక్కా పై కాబాను నాశనం చేయడానకి వచ్చాడు. బేసత్ యొక్క 7వ సంవత్సరంలో దైవప్రవక్త[అ.స] మరియు బనీ హాషిములు ముట్టడికి గురి అయ్యారు. హిజ్రీ యొక్క 4వ సంవత్సరంలో అబూసల్మహ్ ఇబ్నె అబ్దుల్ అసద్ సిర్యహ్(యుద్ధం) జరిగింది. హిజ్రీ యొక్క 9వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] జకాత్ ఆదేశాన్ని ఇచ్చారు మరియు చెల్లిడం కూడా జరిగింది. హిజ్రీ యొక్క 24వ సంవత్సరంలో ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ యొక్క ఖిలాఫత్ పదవి మొదలయ్యింది. హిజ్రీ యొక్క 81వ సంవత్సరంలో ముహమ్మదె హనఫియ్యహ్ మరణించారు. మరి ఆరుగురు ప్రముఖ ఉలమాలు ఇదే రోజున మరణించారు.
2వ తారీఖు: హజ్రత్ ఆదమ్[అ.స] మరణించారు. హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో ఇమామ్ హుసైన్[అ.స] కర్బలాలో ప్రవేశించారు.
3వ తారీఖు: హజ్రత్ యూసుఫ్[అ.స] కారాగారం నుండి విడుదల పొందారు. హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో ఉమర్ ఇబ్నె సఅద్ కర్బలాలో దిగాడు.
4వ తారీఖు: “నమ్రూద్” నరకానికి చేరిన రోజు. హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో ఇమామ్ హుసైన్[అ.స]కు వ్యతిరేకంగా ఒబైదుల్లాహ్ ఇబ్నె జియాద్ కూఫా మస్జిదులో ఉపన్యాసమిచ్చాడు. హిజ్రీ యొక్క 61 సంవత్సరంలో కూఫాకు పంపబడిన ఇమామ్ హుసైన్[అ.స] ప్రతినిధి అయిన “ఖైస్ ఇబ్నె ముసహ్హరె సైదావీ” చంపబడిన రోజు.
5వ తారీఖు: హజ్రత్ మూసా[అ.స] నదిని దాటారు. హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో హసీన్ ఇబ్నె నుమైర్, షబస్ ఇబ్నె రబీయి కర్బలాకు చేరారు.
6వ తారీఖు: హజ్రత్ యహ్యా[అ.స] చంపబడ్డారు. కర్బలాలో ఫురాత్ పై మొదటి ముట్టడి జిరిగింది. ఉమర్ ఇబ్నె సఅద్, ఇమామ్ హుసైన్[అ.స]తో సంభాషించాడు.
7వ తారీఖు: హజ్రత్ మూసా[అ.స] దౌత్యానికి ఎన్నుకోబడ్డారు. కర్బలాలో అహ్లెబైత్[అ.స] పై నీరును నిలిపివేశారు. “ఒబైదుల్లాహ్ ఇబ్బె జియాత్” తరపు నుండి “ఉమర్ ఇబ్నె సఅద్”కు ఉత్తరం అందింది.
8వ తారీఖు: ఇమామ్ హుసైన్[అ.స] ఉమర్ ఇబ్నె సఅద్ తో కలిశారు.
9వ తారీఖు: హజ్రత్ యూనుస్[అ.స] పెద్ద మత్స్యము కడుపు నుండి బయటపడ్డారు. హజ్రత్ మూసా[అ.స], హజ్రత్ మర్యమ్[అ.స]లు జన్మించారు. “షిమ్ర్ ఇబ్నె జిల్ జౌషన్” కర్బలాకు తన సైన్యంతో చేరాడు. శత్రుసైన్యం నుండి హజ్రత్ అబ్బాస్[అ.స] మరియు వారి సోదరులకు వచ్చిన శరణు పత్రాన్ని నిరాకరించారు.
10వ తారీఖు: ఆదమ్ హవ్వా[అ.స]లు స్వర్గం నుండి భూమికి వచ్చిన రోజు. హజ్రత్ నూహ్[అ.స] తుఫాను తరువాత నౌక నుండి బయటకు వచ్చిన రోజు. హజ్రత్ ఇబ్రాహీమ్ జన్మించిన రోజు. హజ్రత్ యూసుఫ్[అ.స]తో హజ్రత్ యాఖూబ్[అ.స] కలిసిన రోజు. మనసులను కలచివేసే కర్బలా సంఘటన సంభవించిన రోజు. హిజ్రీ యొక్క 62వ సంవత్సరంలో “ఉమ్మె సల్మా” మరణించారు. హిజ్రీ యొక్క 67వ సంవత్సరంలో ఉబైదుల్లాహ్ ఇబ్నె జియాద్ చంపబడ్డాడు.
11వ తారీఖు: హజ్రత్ ఆదమ్ మరణించారు. కర్బలాలో ఇమామ్ హుసైన్[అ.స] కుటుంబీకులను మరియు వారి అనుచరులను బంధీలుగా చేసి కూఫా వైపుకు శత్రుసైన్యం తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
12వ తారీఖు: హిజ్రీ యొక్క 61వ సంవత్సరం బంధీలుగా ఉన్న ఇమామ్ హుసైన్[అ.స] అహ్లెబైత్ లు కూఫాకు చేరుకున్నారు. హిజ్రీ యొక్క 95వ సంవత్సరం ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] మరణించారు.
13వ తారీఖు: కర్బలా వీరుల దహనసంస్కారాలు జరిగాయి. బంధీలను ఉబైదుల్లాహ్ ఇబ్నె జియాద్ యొక్క సభలో ప్రవేశపెట్టారు.
14వ తారీఖు: ఉబైదుల్లాహ్ ఇబ్నె జియాద్, యజీద్ కు ఉత్తరం వ్రాశాడు.
15వ తారీఖు: హిజ్రీ యొక్క 2వ లేదా 3వ సంవత్సరంలో “కుద్ర్” యుద్ధం మొదలయ్యింది. హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో “ఖైబర్” యుద్ధం జరిగింది.
17వ తారీఖు: “అస్హాబుల్ ఫీల్”, అల్లాహ్ తరుపు నుండి “అబాబీల్” ఫక్షుల దాడి రూపంలో శిక్షించబడ్డారు.
19వ తారీఖు: కర్బలా బంధీల ప్రయాణం షామ్(సిరియా) వైపుకు మొదలయ్యింది.
22వ తారీఖు: హిజ్రీ యొక్క 37వ సంవత్సరంలో ఇమామ్ అలీ[అ.స], ముఆవియహ్ సైన్యంతో సిఫ్పీన్ యుద్ధానికి సిద్దమయ్యారు.
25వ తారీఖు: ఒక రివాయత్ ప్రకారం హిజ్రీ యొక్క 95వ సంవత్సరంలో ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] మరణించారు. హిజ్రీ యొక్క 198వ సంవత్సరంలో అమీన్ తన సొదరుడు మామూన్ చేత చంపబడ్డాడు.
26వ తారీఖు: హీజ్రీ యొక్క 64వ సంవత్సరంలో యజీద్ సైన్యం మక్కాను చుట్టు ముట్టి దాడిచేసింది.
29వ తారీఖు: కర్బలా బందీయుల సమూహం షామ్(సిరియా)కు చేరింది.        

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10