ముహర్రం మాసం

శని, 09/08/2018 - 12:28

“ఇమామ్ హుసైన్ ప్రాణత్యాగం కోసం విశ్వాసుల హృదయాలలో ఉన్న వేడి మరియు ఉద్రేకం ఎన్నటికి ఆరనిది”

ముహ్రర్రం మాసం

ముహ్రర్రం మాసం
ముహర్రమ్, వివేకం మరియు ప్రేమానురాగాల ఋతువు; మన బుద్ధి మనకు ఇమామ్ హుసైన్[అ.స] గురించి తెలుసుకోమని మనల్ని ఆజ్ఞాపిస్తుంది, అలాగే మనకు వారిపైనున్న ప్రేమానురాగాలు, ఆప్యాయత మనల్ని అబాఅబ్దిల్లాహిల్ హుసైన్[అ.స] మరియు వారి సహచరులతో ప్రయాణానికి సిద్ధం అవ్వండి అని ఆజ్ఞాపిస్తుంది. ముహర్రం మాసం, బుద్ధివివేకాలతో, ప్రేమానురాగాలతో కూడి ఉన్న మాసం. నిజానికి ముహర్రం నెల ప్రారంభంతో మానవత్వానికి సంపూర్ణ స్థాయికి చేర్చే సద్గుణాలతో కూడి ఉన్న ఒక సంపూర్ణ సభ మొదలవుతుంది. అందులో ఔదార్యం, ఉత్తమత్వం, స్వచ్ఛత, ప్రాణత్యాగం, బలిదానం, ఆప్యాయత, ప్రేమానురాగాలు, గౌరవం, ఘనత, వీరత్వం మరెన్నో మంచి స్వభావాలకు సాటిలేని నిదర్శనలు కనబడతాయి. ఎవరికి ఏది కావాలో వారికి అది ఇక్కడ లభిస్తుంది. సంపూర్ణతను పొందాలనే అభిలాష ఉండాలేగాని ఈ ముహర్రం నెల ప్రతీ ఒకరిలో మంచి స్వభావాలను కానుకగా ప్రసాదించి వెళుతుంది. ఇది ఆ మాసంలో ఉన్న ప్రాముఖ్యత కాదు, ఇది ఆ మాసంలో ఇస్లాం కోసం ఆనందంగా ప్రాణాలను అర్పించిన వారి ప్రాణత్యాగం యొక్క ప్రభావం.
దైవప్రవక్త[స.అ] ప్రవచనం: “ఇమామ్ హుసైన్ ప్రాణత్యాగం కోసం విశ్వాసుల హృదయాలలో ఉన్న వేడి మరియు ఉద్రేకం ఎన్నటికి ఆరనిది”[జామె అహాదీసె షియా, భాగం12, పేజీ556] 
అల్లాహ్ ను మనకు కూడా ఈ అమరవీరుల ప్రాణత్యాగం నీడలో సంపూర్ణత్వం ప్రసాదించమని వేడుకుందాం. 

రిఫ్రెన్స్
మర్హూమ్ బురుజర్దీ, జామె అహాదీసె షియా, నాషిర్ ముఅల్లిఫ్, ఖుమ్, 1383. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11