ఆయతుల్లాహ్ సీస్తానీ[అల్లాహ్ అతనిని కాపాడుగాక] తౌజీహుల్ మసాయిల్ ప్రకారం కొన్ని ప్రదేశాలలో నమాజ్ చదవడం మక్రూహ్ గా నిర్ధారించబడ్డాయి. వాటి వివరణ.
కొన్ని ప్రదేశాలలో నమాజ్ చదవడం మక్రూహ్(అసహ్యంగా) నిర్ధారించబడి ఉంది. అవి:
1. హమామ్
2. ఉప్పళము భూమి(Saltmarsh)
3. మనిషికి ఎదురుగా
4. తెరిచి ఉన్న తలుపు ఎదురుగా
5. రోడ్డు, గల్లీలలో వచ్చీ పోయే వాళ్ళకు ఇబ్బంది లేకపోతే, అది ఇబ్బంది అయితే హరామ్ అవుతుంది. ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలిగించటం హరామ్ కాబట్టి.
6. నిప్పు మరియు దీపానికి ఎదురుగా
7. వంటగదిలో మరియు ఎక్కడైతే నిప్పు అంటించబడి ఉందో అక్కడ
8. మలమూత్రాల గొయ్యి మరియు బావికి ఎదురుగా
9. పటం మరియు జీవి యొక్క బొమ్మ ఎదురుగా, దానిని గుడ్డతో కప్పనంతవరకు
10. ముజ్నిబ్ ఉన్న గదిలో
11. పటం ఉన్న గదిలో అది ఎదురుగా లేకపోయిన సరే
12. సమాధి ఎదురుగా
13. సమాధి పైన
14. రెండు సమాధుల మధ్యలో
15. స్మశానంలో
ఎవరైనా జనం తిరుగుతున్న ప్రదేశంలో నమాజ్ చదువుతుంటే లేదా అతడి ఎదురుగా ఎవరైనా ఉంటే, తన ముందు ఏదైనా వస్తువు పెట్టుకోవడం ముస్తహబ్(మంచిది), కర్రా లేదా త్రాడు అయిన సరిపోతుంది.[తౌజీహుల్ మజాయిల్, పేజీ168]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి