ఆయతుల్లాహ్ సీస్తానీ[అల్లాహ్ అతనిని కాపాడుగాక] తౌజీహుల్ మసాయిల్ ప్రకారం నమాజ్ ను బాతిల్ చేసే అంశాల వివరణ.
నమాజ్ ను 12 చర్యలు బాతిల్ చేస్తాయి. అవి:
1. నమాజ్ మధ్యలో నమజ్ యొక్క షరత్తుల నుండి ఏదో ఒక షరత్తు లేదు అని గుర్తుకు రావడం. ఉదాహారణకు నమాజ్ మధ్యలో వేసుకున్న బట్టలు అపవిత్రమైనవి అని తెలుసుకోవడం.
2. నమాజ్ మధ్యలో ఉద్దేశపూర్వకంగానో లేదా అనుకోకుండానో ఉజూ లేదా గుస్ల్ ను బాతిల్ చేసే పనిని చేయడం. ఉదాహారణకు అపానవాయువు వదలడం, మలవిసర్జన మొ..
3. వినయవిధేయతలకు నిదర్శనం అని భావించి నమాజ్ లో చేయి పై చేయి వేయడం(చేతులు కట్టుకోవడం).
4. అల్ హంద్ సూరహ్ చదివిన తరువాత “ఆమీన్” చెప్పడం.
5. నమాజ్ మధ్యలో ఉద్దేశపూర్వకంగా కాబా వైపు నుండి ముఖాన్ని త్రిప్పుకోవడం.
6. నమాజ్ మధ్యలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడం. అది అర్ధం ఉన్న ఒక అక్షరమైన సరే.
7. నమాజ్ మధ్యలో ఉద్దేశపూర్వకంగా గట్టిగా నవ్వడం.
8. ప్రాపంచిక సమస్యల కోసం నమాజ్ లో గట్టిగా లేగా మెల్లగా ఏడవడం. అదే అల్లాహ్ పట్ల భీతితో రోధిస్తే అంతకు మించింది లేదు.
9. నమాజ్ రూపురేకలను మార్చే చర్య. ఉదాహరణకు పెద్ద గాలి వచ్చి ఎగిరేసుకుపోవడం వంటివి.
10. నమాజ్ మధ్యలో ఎదైనా తినడం మరియు త్రాగడం.
11. రెండు రక్అత్ల మరియు మూడు రక్అత్ల రక్అత్లలో సందేహించడం మరియు అలాగే నాలుగు రక్అత్ల నమాజ్ లలో మొదటి రెండు రక్అత్లలో సందేహించడం.
12. అర్కానె నమాజ్ నుండి ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా వదిలేయడం. లేదా ఎక్కువ తక్కువలు చేయడం.[తౌజీహుల్ మజాయిల్, పేజీ204-209]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి