నమాజ్ ను బాతిల్ చేసే సందేహాలు

శని, 10/06/2018 - 18:36

ఆయతుల్లాహ్ సీస్తానీ గారి తౌజీహుల్ మసాయిల్ ప్రకారం నమాజ్ చదువుతున్నప్పుడు 22 విధాల సందేహాలు కలగవచ్చు. అవి మూడూ భాగాలలో విభజించబడి ఉన్నాయి.

నమాజ్ ను బాతిల్ చేసే సందేహాలు

నమాజ్ చదువుతున్నప్పుడు 22 విధాల సందేహాలు కలగవచ్చు, అందులో 7 సందేహాలు నమాజ్ ను బాతిల్ చేస్తాయి. 6 సందేహాలను పట్టించుకోనవసరం లేదు మరి మిగిలిన 9 సందేహాలు సరైనవి.
నమాజ్ ను బాతిల్ చేసే 7 సందేహాలు
1. రెండు రక్అత్ల వాజిబ్ నమాజ్ అనగా ఉదయం నమాజు మరియు ప్రయాణంలో చేసే “ఖస్ర్” నమాజ్ లు, వీటి రక్అత్లలో సందేహం కలిగితే ఆ నమాజ్ బాతిల్ అవుతుంది.(మస్తహబ్ నమాజ్ బాతిల్ అవ్వదు).
2. మూడు రక్అత్ల నమాజ్ ఒక్క రక్అత్ లలో సందేహం కలిగితే.
3. నాలుగు రక్అత్ల నమాజ్ లో ఒక రక్అత్ లేక ఎక్కువ రక్అత్లను చదవడంలో సందేహపడడం.
4. నాలుగు రక్అత్ల నమాజ్ లో రెండవ సజ్దహ్ చేయక ముందు రెండు రక్అత్లు చదివానా లేకా ఎక్కువ చదివాన అని సందేహపడడం.
5. రెండు రక్అత్ల మరియు ఐదు రక్అత్ల లేదా రెండు మరియు ఐదు కన్న ఎక్కువ రక్అత్ల మధ్య సందేహపడడం.
6. మూడు రక్అత్ల మరియు ఆరు రక్అత్ల లేదా మూడు మరియు ఆరు కన్న ఎక్కువ రక్అత్ల మధ్య సందేహపడడం.
7. నాలుగు రక్అత్ల మరియు ఆరు రక్అత్ల లేదా నాలుగు మరియు ఆరు కన్న ఎక్కువ రక్అత్ల మధ్య సందేహపడడం.
ఈ సందేహాలు కలగగానే వెంటనే నమాజ్ ను ఆపకుండా కొంచెం ఆలోచించాలి దాంతో నమాజ్ దానికి అదే ఆగిపోతుంది. ఇలా చేయడమే మంచిది.[తౌజీహుల్ మజాయిల్, పేజీ211].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20