.దైవప్రవక్త[స.అ] తన తరువాత తన ఉమ్మత్ మార్గభ్రష్టులు కాకుండా ఉండేందుకు ప్రవచించిన హదీస్.
దైవప్రవక్త[స.అ] కరుణకు ప్రతిరూపంగా నియమించి అవతరించబడ్డారు. మరియు అతని ఉమ్మతే అన్ని ఉమ్మతులలో ఉత్తమమైనదిగా ఉండాలని చాలా ఆశతో ఉండేవారు. అతని తరువాత ఎటువంటి భేదం ఏర్పడకూడదు అందుకని దైవప్రవక్త[స.అ]కు ఉమ్మత్ కోసం ఒక పద్ధతిని నిర్ణయించి వెళ్ళవలసిన అవసరం ఎంతైన ఉంది. మరియు అందుకే సహాబీయులు ముహద్దిసీనులు ఆయన నుండి రివాయత్‌ను ఇలా ఉల్లేఖించారు:
تَرَكْتُ فِيكُمُ الثَّقَلَيْنِ مَا إِنْ تَمَسَّكْتُمْ بِهِمَا لَنْ تَضِلُّوا بَعْدِي ابدا كِتَابُ اللَّهِ وَ عِتْرَتِي أَهْلُ بَيْتِي لَنْ يَفْتَرِقَا حَتَّى يَرِدَا عَلَيَّ الْحَوْضَ فَانْظُرُوا كَيْفَ تَخْلُفُونِّي فِيهِمَا
అనువాదం: “మీ మధ్య రెండు అమూల్యమైన వాటిని వదిలి వెళ్తున్నాను ఆ రెండింటితో కలిసి ఉన్నంతవరకు మీరు దారి తప్పరు (ఆ రెండు) ఖుర్ఆన్ మరియు నా ఇత్రత్ (అనగా) అహ్లెబైత్[అ.స]లు. ఆ రెండు నా వద్దకు (కౌసర్) సేలయేరు పై చేరనంత వరకు దూరం అవ్వరు. ఇక చూద్దాం మీ ప్రవర్తన వాళ్ళ పట్ల ఎలా ఉంటుందో”.[ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ148]
రిఫ్రెన్స్
హాకిమ్, ముస్తద్రక్, భాగం3, పేజీ148.
వ్యాఖ్యానించండి