అప్రతిష్ట బ్రతుకు ప్రతిష్టాత్మకమైన చావు

ఆది, 10/07/2018 - 17:21

సిఫ్ఫీన్ యుద్ధం సమయంలో జరిగిన ఒక సంఘటన పరంగా అప్రతిష్ట బ్రతుకు కన్నా ప్రతిష్టాత్మకమైన చావు మేలు అన్న అంశం పై సంక్షిప్త వివరణ.

అప్రతిష్ట బ్రతుకు ప్రతిష్టాత్మకమైన చావు

సిఫ్ఫీన్ యుద్ధంలో అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] సిఫ్ఫీన్ ప్రదేశానికి చేరినప్పుడు, నిళ్ళు ఉన్న ప్రదేశాన్ని ముఆవియహ్ చుట్టుముట్టిన విషయాన్ని గ్రహించి, తన సైన్యంతో ఇలా అన్నారు: “నీరున్న ప్రదేశాన్ని చుట్టుముట్టారు, ఇక ఇప్పుడు దప్పికతో చావాలి లేదా యుద్ధం చేసి నీళ్ళను దక్కించుకోవాలి. ఈ యుద్ధంలో కొందరి ప్రాణాలు పోవచ్చు కూడానూ, కాని ఇది మాత్రం తెలుసుకోండి; అవమానం మరియు తిరస్కారపు బ్రతుకు, నిజానికి ఓటమి; కాని అదే ఒకవేళ ప్రాణాలను త్యాగం చేసి గౌరవంగా చావడం, ఇది నిజానికి విజయం”
ఆ తరువాత ఇలా అన్నారు: “మీ పెదవులను ఈ నీళ్ళతో తడపాలనుకుంటే అంతకు ముందు మీ కత్తులను శత్రుసైన్య రక్తంతో తడపాలి” ఇమామ్ అలీ[అ.స] సైన్యం శత్రు సైన్యం పై దాడి చేసింది. ఇమామ్ హుసైన్[అ.స] ఆ సైన్యం పై ఆధిపథ్యాన్ని నిర్వర్తించారు. నీళ్ళ పై ఉన్న ముట్టడిని తొలగించి తమ సొంతం చేసుకున్నారు. ఇమామ్ హుసైన్[అ.స] విజయం సాధించి తిరిగి వస్తుండగా ఇమామ్ అలీ[అ.స] ఇలా అన్నారు: “ఇది హుసైన్ చేతుల మీదుగా జరిగిన విజయం యొక్క ఆరంభం”[బిహారుల్ అన్వార్, భాగం32, పేజీ442].
అప్రతిష్ట బ్రతుకు కన్నా ప్రతిష్టాత్మకమైన చావు మేలు.

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుత్తఆరుఫ్ లిల్ మత్బూఆత్, బీరూత్, లెబ్నాన్, 1421.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3