ఇమామ్ హుసైన్[అ.స] అహ్లె సున్నత్ గ్రంథాలలో

బుధ, 10/24/2018 - 07:53

ఇమామ్ హుసైన్[అ.స] యొక్క స్థానం వారి యొక్క గౌరవం గురించి వివరించబడిన కొన్ని హదీసులు అహ్లె సున్నత్ గ్రంథాల నుండి.

ఇమామ్ హుసైన్[అ.స] అహ్లె సున్నత్ గ్రంథాలలో

1. అబూహురైరహ్ (అహ్లెసున్నత్ యొక్క ప్రముఖ రావీ) ఇలా అనెను: “దైవప్రవక్త[స.అ] హుసైన్ ఇబ్నె అలీ[అ.స]ను తన ఓడిలో తీసుకొని “ఓ అల్లాహ్! నేను ఇతన్ని ఇష్టపడుతున్నాను నీవు కూడా ఇతన్ని ఇష్టపడు” అని చెబుతుండగా చూశాను.[ముస్తద్రిక్ అల్ సహీహైన్, భాగం3, పేజీ177].
2. ఖాజీ నూరుల్లాహ్ షూష్తరీ తన పుస్తకాం “అహ్ఖాఖుల్ హఖ్ఖ్”లో ఇలా ఉల్లేఖించారు: ‘అబూల్ ముఅయ్యద్ ముఅఫ్ఫఖ్ ఇబ్నె అహ్మద్’(అహ్లె సున్నత్ ఆలిమ్) వివిధ రావీయుల క్రమాన్ని మరియు వారు అబూబక్ర్ నుండి రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను: “హసన్ మరియు హుసైన్ స్వర్గయువకుల నాయకులు” [అహ్ఖాఖుల్ హక్, భాగం10, పేజీ708].
3. ఇదే రివాయత్ ను ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ నుండి అహ్లె సున్నత్ యొక్క గొప్ప ఆలిమ్ “హాఫిజ్ అబూనయీమ్ ఇస్ఫెహానీ” తన గ్రంథం “హిల్యతుల్ ఔలియా” భాగం4 పేజీ139లో ఉల్లేఖించారు.[అహ్ఖాఖుల్ హక్, భాగం10, పేజీ564]
4. అలాగే అహ్మద్ ఇబ్నె హంబల్ తన హదీస్ గ్రంథం “ముస్నద్”లో చాలా రావీయుల ద్వారా రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: “దైవప్రవక్త[అ.స] హసన్ మరియు హుసైన్ ను తన గుండెలకు హత్తుకొని ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నేను ఈ ఇద్దరిని ఇష్టపడుతున్నాను, నీవు కూడా వారిని ఇష్టపడు”[ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం5, పేజీ329].

రిఫ్రెన్స్
ముస్తద్రిక్ అల్ సహీహైన్. అహ్ఖాఖుల్ హక్. ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17