ఇమాన్ హసన్[అ.స] మరణం పై ఇబ్నె అసాకిర్ ఉల్లేఖన

మంగళ, 11/06/2018 - 14:01

ఇమాన్ హసన్[అ.స] ఎలా మరణించారు, ఎవరు వారికి విషమిచ్చారు అన్న పలు విషయాల వివరణ అహ్ల సున్నత్ ఆలిమ్ ఇబ్నె అసాకిర్ ఉల్లేఖనం.

ఇమాన్ హసన్[అ.స] మరణం పై ఇబ్నె అసాకిర్ ఉల్లేఖన

 

1. “ఇబ్నె అసాకిర్” రావీయుల క్రమం ద్వార ముహమ్మద్ ఇబ్నె సల్లామె జమ్ఈ నుండి ఇలా ఉల్లేఖించారు: జొఅ’దహ్ బింతె అష్అస్, హసన్ ఇబ్నె అలీ భార్య. యజీద్ ఆమెను ప్రేరేపించి ఇలా అన్నాడు: “ఒకవేళ నీవు హసన్[అ.స]కు విషమిస్తే నేను నీతో వివాహం చేసుకుంటాను” ఆమె అలాగే చేసింది. హసన్[అ.స] మరణించిన తరువాత జొఅ’దహ్, యజీద్ వద్దకు తన ప్రమాణాన్ని అమలు పరచమని ఒకరితో కబరు పంపించింది. యజీద్ ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా! నీవు హసన్ భార్యగా ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదు అలాంటిది నా భార్యగా ఉండేందుకు ఎలా రాజీ పడతాను!?”
2. “ఇబ్నె అసాకిర్” తన రావీయుల క్రమంతో అబీ హాజిమ్ నుండి ఇలా ఉల్లేఖించారు: హసన్[అ.స] చివరి నిమిషాలలో, వారి సోదరులు హుసైన్[అ.స]తో ఇలా అన్నారు: నన్ను నా తండ్రి అనగా దైవప్రవక్త[స.అ] వద్ద సమాధి చేయండి రక్తం చిందే భయం లేకుంటే, అలాంటి సమయంలో చాలా జాగ్రత్త వహించండి నా వల్ల రక్తపాతం అవ్వకూడదు, అందుకని నన్ను ముస్లిముల స్మశానంలో సమాధి చేయండి.[అహ్లె బైత్ అజ్ దీద్గాహె అహ్లె సున్నత్, పేజీ31].

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, అహ్లెబైత్ అజ్ దీద్గాహె అహ్లె సున్నత్, మస్జిదె ముఖద్దసె జమ్కరాన్, ఖుమ్, 1385.     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10