ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] తన విరోధులైన సరే అవసరానికి సహాయం చేసేవారు, అన్న విషయాన్ని నిదర్శించే సంఘటన.
ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] యొక్క సద్గుణం గురించి చెప్పాలంటే, చివరికి వారు తన విరోధులైన సరే అవసరానికి సహాయం చేసేవారు. ముహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె ఇబ్రాహీమ్ ఇబ్నె మూసా ఇబ్నె జాఫర్[అ.స] ఇలా ఉల్లేఖించెను: “దరిద్రం మమ్మల్ని చుట్టుముట్టి, మా జీవితం కష్టంగా గడుస్తుంది. ఒకరోజు నా తండ్రి(ఇతను ఇమామ్ మూసా ఇబ్నె జాఫర్[అ.స] తరువాత ఎవరిని ఇమామ్ గా అంగీకరించలేదు) నాతో ఇలా అన్నారు: “హసన్ ఇబ్నె అలీ వద్దకు వెళ్దాం; ఎందుకంటే వారిని వారి వీరత్వ సుగుణం ద్వార గుర్తుచేస్తారు” నేను నా తండ్రితో “మీకు వారు తెలుసా!?” అని అడిగాను. తండ్రి: లేదే!. వెళ్తుండగా నా తండ్రి గారు ఇలా అన్నారు: వారు(ఇమామ్) 500 దిర్హములు నాకు ఇస్తే బాగుంటుంది అందులో నుండి 200 దిర్హములు దుస్తులకు, 200 దిర్హములు అప్పులు తిరిగి ఇచ్చేందుకు మరియు 100 దిర్హములు మిగిలిన ఖర్చుల కోసం వాడుకుంటాను. నేను కూడా ఇంకో 300 దిర్హములు నాకు ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను, 100 దిర్హములు దుస్తుల కోసం, 100 దిర్హములు వాహనం కోసం మరియు 100 దిర్హములు మిగిలిన ఖర్చుల కోసం!.
చివరికి ఇమామ్ వద్దకు చేరుకున్నాము, వారు నా తండ్రితో “ఎందుకని ఇంతవరకు నా వద్దకు రాలేదు?” అని అడిగారు. తండ్రి: “నేనున్న పరిస్థితిలో మీ వద్దకు రావడం సిగ్గుగా అనిపించేది!”. అక్కడ నుండి తిరిగి వచ్చేద్దామని అనుకున్నప్పుడు మేము ఆలోచించుకున్నంత సొమ్మును మాకిచ్చారు...., అప్పుడు నేను నా తండ్రితో “వారి ఇమామత్ పై ఇంత స్పష్టమైన నిదర్శనానికి మించిన నిదర్శనం కావాలా!?” అని అడిగాను.
తండ్రి: “నేను నా మతానికి అలవాటు పడిపోయాను!”[అల్ ఇర్షాద్, భాగం2, పేజీ326].
రెఫ్రెన్స్
షేఖ్ ముఫీద్, అల్-ఇర్షాద్, కొంగొరహ్ షేఖ్ ముఫీద్, ఖుమ్, 1413ఖ.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya .. Iltemase Dua..
MashaAllah
Shukriya,, Jazakallah.
వ్యాఖ్యానించండి