అబ్బాసీ ఖిలాఫత్ అధికారుల తరపు నుండి ఎంత ఒత్తిడి ఉన్న సరే ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] రాజకీయ రహస్య చర్యల పట్ల నాయకత్వం వహించేవారు.
అబ్బాసీ ఖిలాఫత్ అధికారుల తరపు నుండి ఎంత ఒత్తిడి ఉన్న సరే ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] రాజకీయ రహస్య చర్యల పట్ల నాయకత్వం వహించేవారు. అధికార గూఢచారుల దృష్టికి దూరంగా ఉంచేవారు.
ఇమామ్ యొక్క సేవకుడు “దావూద్ ఇబ్నె అస్వద్”, కట్టెలు తీసుకొచ్చి స్నానగదిని వేడిచేయడం ఇతని పని. అతడు ఇలా అనెను: ఇమామ్ నాతో “ఈ కట్టెలను ‘ఉస్మాన్ ఇబ్నె సయీద్’ వద్దకు తీసుకెళ్ళు” అని చెప్పారు. నేను కట్టెలను తీసుకొని బయలు దేరాను, దారి మధ్యలో ఒక నీళ్ళుమోసేవాడు ఎదురు పడ్డాడు, అతడి కంచరగాడిద నా దారికి అడ్డుపడింది. అతడు నాతో తన గాడిదను ప్రక్కకు తోలమని అన్నాడు, నేను కట్టెను తీసుకొని గాడిదను కొట్టాను, దాంతో కట్టె విరిగింది, విరిగిన చోట చూస్తే ఆ కట్టె లోపల ఒక ఉత్తరం కనిపించింది, వెంటనే ఆ కట్టెను సంకలో పెట్టుకొని తిరిగి వచ్చేశాను, అక్కడ ఆ నీళ్ళవాడు నన్ను తిట్టుకుంటూనే ఉన్నాడు. ఇమామ్ ఇంటి తలుపు వద్దకు చేరే సరికి ఇమామ్ (మరో)సేవకుడు “ఈసా” అతడిని ఆహ్వానిస్తూ ఇలా అనెను: యజమాని, “ఎందుకు గాడిదను కొట్టి కట్టెను విరగ్గొట్టావు” అని అడుగుతున్నారు. నేను “ఆ కట్టె లోపల ఏముందో నాకు తెలియదు కదా!?” అన్నాను. (అప్పుడు) ఇమామ్ ఇలా అన్నారు: “ఎందుకని క్షమాపణ అడగాల్సివచ్చే పని చేస్తావు, ఇక ఇలాంటి పని చేయకు, ఒకవేళ మమ్మల్ని దూషిస్తున్నా సరే నీ దారి నీదిగా వెళ్ళిపో వారితో మాట్లాడకు. మేము చాలా చెడు ప్రదేశంలో(స్థితి) జీవితం గడుపుతున్నాము, నువ్వు నీకిచ్చిన పని చేయి అంతే, నీవు చేసే ప్రతీ పని నాకు తెలిస్తుంది అన్న విషయం గుర్తుంచుకో.[మనాఖిబె ఆలె అబీతాలిబ్, భాగం4, పేజీ427].
ఈ సంఘటన ద్వార తెలిసే విషయమేమిటంటే, ఇమామ్ తన కర్తవ్యాన్ని వారి పై ఎంత ఒత్తిడి ఉన్న సరే రహస్యంగా నిర్వర్తించేవారు. వారి అనుచరులకు ఈ విధంగా ఆదేశాలను పంపేవారు మరియు వారి సమస్యలను పరిష్కరించేవారు.
రిఫ్రెన్స్
ఇబ్నె షహ్రె ఆషూబ్ మాజిందరానీ, మనాఖిబె ఆలె అబీతాలిబ్(అ.స), ఇంతెషారాతె అల్లామహ్, 1379ఖ.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya...
MashaAllah
Shukriya...
MashaAllah
Shukriya .. jazakallah ..
వ్యాఖ్యానించండి