ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] రచనలు

బుధ, 11/14/2018 - 10:08

ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] వ్రాసిన రచనల మరియు పట్టణాలకు వ్రాసిన ఉత్తరాల గురించి సంక్షిప్త వివరణ.

ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] రచనలు

ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] శిష్యుల శిక్షణ ఇవ్వడం మరియు రచయితలను ప్రోత్సాహించడమే కాకుండా వారు కూడా జ్ఞానం, విద్యా, హిదాయత్ మరియు సమాజం ఎదుగుదల కోసం స్వయంగా కొన్ని గ్రంథాలు మరియు పలు ప్రముఖులకు ఎన్నో ఉత్తరాలు వ్రాశారు. ఉదా:
1. “తఫ్సీరుల్ ఖుర్ఆన్” ఈ గ్రంథాన్ని ముహమ్మద్ ఇబ్నె ఖాలిద్ యొక్క సోదరుడు హసన్ ఇబ్నె ఖాలిద్ ద్వార ఉల్లేఖించారు. చెప్పదగ్గ విషయమేమిటంటే ఈనాటికీ “తఫ్సీరుల్ ఇమామ్ అల్ అస్కరీ[అ.స]” పేరుతో ఒక గ్రంథం ఉంది.
2. “అల్ మున్ఖబహ్” ఈ గ్రంథంలో చాల అహ్కాములు మరియు హలాల్ హరాముల గురించి ఉల్లేఖించబడి ఉంది.
3. ఉత్తారాలు.
ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] షియా సంస్కారం మరియు జ్ఞానం, హిదాయత్ మరియు రుజుమార్గం కోసం చాలా పట్టణాలకు ఉత్తరాలు వ్రాశారు. ఉదా: ఖుమ్ లో ఉన్న షియాలకు వ్రాసిన ఉత్తరాలు, అవి ఇప్పటికీ గ్రంథాలలో లిఖించబడి ఉన్నాయి. అలాగే “అలీ ఇబ్నె బాబ్వై” మరియు “ఇస్హాఖ్ ఇబ్నె ఇస్మాయీల్ నైషాబూరీ”కు వ్రాసిన ఉత్తరం వ్రాశారు. [మనాఖిబె ఆలె అబీతాలిబ్, భాగం4, పేజీ425].

రిఫ్రెన్స్
ఇబ్నె షహ్రె ఆషూబ్ మాజిందరానీ, మనాఖిబె ఆలె అబీతాలిబ్(అ.స), ఇంతెషారాతె అల్లామహ్, 1379ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 81