హజ్రత్ యూనుస్[అ.స]

బుధ, 11/28/2018 - 19:15

ప్రజల హిదాయత్ కోసం అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రవక్తలలో ఒకరైన హజ్రత్ యూనుస్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

హజ్రత్ యూనుస్[అ.స]

హజ్రత్ యూనుస్[అ.స] అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రవక్తలలో ఒకరు. తండ్రి పేరు “మత్తా” మరియు వారి బిరుదు “ౙున్నూరైన్”.  వారికి ఈ బిరుదు రావడానికి కారణం వారు చరిత్ర పెద్ద చేపతో ముడి పడి ఉండడం.
వీరు కూడా అల్లాహ్ యొక్క ప్రముఖ ప్రవక్త. హజ్రత్ యూనుస్[అ.స], హజ్రత్ మూసా[అ.స] మరియు హజ్రత్ హారూన్[అ.స] తరువాత అవతరించబడ్డారు. కొందరు వారిని హజ్రత్ హూద్[అ.స] యొక్క సంతతి నుండి అనీ మరియు వారు “సమూద్” వర్గంలో మిగిలిపోయిన వారి యొక్క హిదాయత్ బాధ్యతలు చేతపట్టారు అని భావిస్తారు.
కొందరు హజ్రత్ ఈసా[అ.స]కి 825 సంవత్సరాల క్రితం వచ్చారు, మరియు ఇప్పుడు కూఫహ్ దగ్గరలో “షత్త్” ప్రక్కన వారి సమాధి ఉంది.
కొన్ని గ్రంథాల ప్రకారం; వారు బనీ ఇస్రాయీల్ యొక్క ప్రవక్త అని, వారు హజ్రత్ సులైమాన్[అ.స] తరువాత “నైనవా” వాసుల హిదాయత్ కోసం ఎన్నుకోబడ్డారు అని ఉంది.
ఏదైతేనేం వారు  ప్రముఖ ప్రవక్తలలో ఒకరు మరియు ఖుర్ఆన్ వారి గొప్పను చాటింది అని తెలుస్తుంది.[తఫ్సీరె నమూనహ్, భాగం19, పేజీ179].

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11