.ఇమామ్ అలీ(అ.స) రుజుమార్గాన్ని ప్రజలకు జ్ఞాపకం చేయిస్తు చెప్పిన మాటలు.
ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: ఎటు పయనిస్తున్నావు? ఎక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నావు? వాస్తవానికి హిదాయత్ ద్వజం ఎత్తి ఉంది, గుర్తులు చాలా స్పష్టంగా ఉన్నాయి, హిదాయత్ యొక్క స్ధంభం స్థాపించబడి ఉంది. అయితే నిన్ను ఎక్కడ దారితప్పిస్తున్నారు? నీ ప్రవక్త యొక్క ఇత్రత్ మీలో ఉండగా నీవు గుడ్డివాడివి ఎందుకు అయ్యావు?. (విను) ప్రవక్త ఇత్రతే(అహ్లెబైత్ లే) సత్యవంతులు, దీన్ యొక్క ద్వజం, సత్యానికి ముఖద్వారము, ఖుర్ఆన్ అవతరించడానికి మంచి మరియు అనువైన స్థానం వాళ్ళే అని భావించు. మిక్కిలి దాహంతో అల్లాడుతున్న జంతువుల వలే వారి వద్దకు (దీన్ జ్ఞానాన్ని పొందడానికి) పరుగులు తీసుకుంటూ రా. ప్రజలారా! మీ దైవప్రవక్త(స.అ) మాట నమ్మండి: మాలో నుండి మరణించినవారు మరణించరు, మాలో నీవు ఎవరినైతే పాత అని అనుకుంటావో వారు పాత కారు. నీవు తెలియనిది చెప్పకు. సాధారణంగా మీకు నచ్చనిదే యదార్ధం అయ్యి ఉంటుంది. ఎవరికి వ్యతిరేకంగా మీ వద్ద ఎటువంటి సాక్ష్యం లేదో (మరియు ఆ వ్యక్తిని నేనే) అతడిని నిస్సాయులుగా భావించు. నేను మీ మధ్య “సిఖ్లె అక్బర్” పై అమలు చేయలేదా? మరియు మీలో “సిఖ్లె అస్గర్”ను వదల లేదా, మీ కోసం ఈమాన్ యొక్క ద్వజాన్ని స్థాపించలేదా?”.[నెహ్జుల్ బలాగహ్, భాగం1, పేజీ155]
రిఫ్రెన్స్
సయ్యద్ రజీ, నెహ్జుల్ బలాగహ్, భాగం1, పేజీ155.
వ్యాఖ్యానించండి