త్రాగుబోతు యొక్క శిక్ష దైవప్రవక్త[స.అ] దృష్టిలో

బుధ, 12/05/2018 - 08:56

ఇస్లాం మద్యపానం సేవించడాన్ని నిషిద్దిస్తుంది. మద్యపానం సేవించేవారి యొక్క పరిస్థితి గురించి దైవప్రవక్త[స.అ] హదీసుల ద్వారా తెలుసుకుందాం.

త్రాగుబోతు యొక్క శిక్ష దైవప్రవక్త[స.అ] దృష్టిలో

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఒక వ్యక్తి మద్యం సేవిస్తే వాడికి కొరడాతో కొట్టండి, ఒకవేళ అతడు మరలా త్రాగితే మరలా కొరడాతో కొట్టండి, అలాగే అతడు ఒకవేళ నాలుగో సారి కూడా త్రాగితే వాడిని చంపేయండి”[కన్జుల్ ఉమ్మాల్, భాగం5, హదీస్ నెం13707].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “త్రాగుబోతు అల్లాహ్ కారుణ్యానికి దూరమైనవాడు, త్రాగుబోతు విగ్రాహారాధన చేసేవాడితో సమానం, ప్రళయంనాడు ఫిర్ఔన్ మరియు హామాన్‌లతో పాటు లేపబడతాడు”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ141].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అల్లాహ్ సాక్షిగా! త్రాగుబోతు దప్పికతో చస్తాడు, వాడు తన సమాధిలో కూడా దాహంతోనే ఉంటాడు మరియు ప్రళయంనాడు దాహంతోనే లేపబడతాడు, మరి వెయ్యి సంవత్సరాల వరకు అదే దాహంతో ఉంటాడు”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ147].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “అల్లాహ్ సాక్షిగా! త్రాగుబోతు అంతిమదినాన నల్లని ముఖం, ఉబ్బిన కళ్ళు మరియు వంకర మూతితో లెపబడతాడు, అప్పుడతడి నోట్లో నుండి ఉమ్ము అతడి కాళ్ళపై పడుతూ ఉంటుంది మరియు అతడిని చూసిన వాడు అతడు అపవిత్రుడు అని తెలుసుకుంటాడు”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ147].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “సమాధి నుండి బయటకు వచ్చిన త్రాగుబోతు రెండు కళ్ళ మధ్యలో ఇలా లిఖించబడి ఉంటుంది: అల్లాహ్ కరుణకు నోచుకులేదు”[కన్జుల్ ఉమ్మాల్, భాగం16, హదీస్ నెం43958].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: త్రాగుబోతుకు నా శరణు దక్కదు, అల్లాహ్ సాక్షిగా! అతడు కౌసర్ సెలయేరులో నా వద్దకు రాలేడు”[వసాయిల్ అల్ షియా, భాగం17, పేజీ261].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “అల్లాహ్ త్రాగుబోతుకు 360 రకాల శిక్షలు విధిస్తాడు”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ152].

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17