మద్యపానం నాశనానికి కారణం

బుధ, 12/05/2018 - 09:18

మద్యపానం నాశనానికి కారణం అది ఇహలోకంలో కానివ్వండి లేదా పరలోకంలో కానివ్వండి, అన్న విషయం పై దైవప్రవక్త[స.అ] హదీసుల నిదర్శనం.

 మద్యపానం నాశనానికి కారణం

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “త్రాగుబోతుకు సలామ్ చేసినా, లేదా గుండేలకు హత్తుకున్నా, లేదా చేతులు కలిపినా, అల్లాహ్ అతడి 40 ఏళ్ళ పుణ్యాన్ని నాశనం చేస్తాడు”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ151].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఒక ఇంట్లో ఈ నాలుగు విషయాలు గనక వస్తే ఆ ఇంటిని దీవెనలు కూడా మంచిగా మార్చనటువంటి విధంగా నాశనం అవుతుంది. ఆ నాలుగు విషయాలు: ద్రోహం, దొంగతనం, మద్యపానం సేవించడం మరియు వ్యభిచారం”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ125].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఎవరైతే మద్యపానం సేవించి పడుకుంటాడో ఆ రాత్రి షైతాన్ యొక్క పెళ్ళిరోజు”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ 148].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: మద్యపానానికి దూరంగా ఉండండి, ఆ పాపం నుండి పాపములు మొలకెత్తుతాయి ఒక చెట్టు నుండి ఎన్నో చెట్లు పుట్టుకొచ్చేటట్లు”[నెహ్జుల్ ఫసాహహ్, హదీస్989].
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “మద్యపానం పాపములకు క్రేంద్రం, చెడుకు మూలం మరియు దుష్టతకు తాళం”[బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ149].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29