హజ్రత్ జిబ్రయీల్[అ.స]

బుధ, 12/05/2018 - 20:16

హజ్రత్ జిబ్రయీల్[అ.స] ను మస్లిములు, యూదులు మరియు క్రైస్తవులు ఏమంటారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

హజ్రత్ జిబ్రయీల్[అ.స]

హజ్రత్ జిబ్రయీల్[అ.స], అల్లాహ్ తరపు నుండి దైవవాణి తీసుకొచ్చే దూత. అల్లాహ్ కు అతీ సామిప్యంగల మరియు దూతలందరి కన్న గొప్ప దూత. అల్లాహ్ జ్ఞానం యొక్క కాంతి అతనిపై పడుతుంది మరి అతని ద్వార మిగతా దూతల పై పడుతుంది. జిబ్రయీల్ ఆ నాలుగు గొప్పదూతలలో ఒకరు అంతేకాదు వారిలో మిగతావారికన్నా గొప్పదూత. దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “నేను మీకు దూతలలో అతి ఉత్తమ దూత ‘జిబ్రయీల్’ గురించి చెప్పనా?”
వారి పేరు అరబీ భాషలో పలు విధాలుగా పలుకుతారు; “జిబ్రీల్”, “జిబిరీల్”, “జిబ్రాయిల్”, “జిబ్రాయీల్”, “జబ్రయీల్”, “జిబ్రీన్”. కాని యూదులు మరియు క్రైస్తవులు “గాబ్రీల్” అనగా అల్లాహ్ కు సంబంధించిన వ్యక్తి మరియు అల్లాహ్ శక్తి యొక్క ప్రఖ్యాతి. వారు ప్రవక్త దానియాల్[అ.స] పై రెండు సార్లు అవతరించబడ్డారు. ప్రవక్త జకర్రియ్యా[అ.స]కు “మీకు యహ్యా[అ.స] జన్మిస్తారు” అని శుభవార్త ఇచ్చారు. జనాబె మర్యమ్[అ.స]కు హజ్రత్ ఈసా[అ.స] జన్మిస్తారని శుభవార్త ఇచ్చారు.
ఖుర్ఆన్ యొక్క ఆయత్లలో జిబ్రయీల్ యొక్క పేర్లు; “జిబ్రీల్” “రూహుల్ అమీన్” “రసూలున్ కరీమ్”.[ఫరిష్తగాన్, పేజీ101].

రిఫ్రెన్స్
అలీరిజా రిజాలీ తెహ్రానీ, ఫరిష్తగాన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7