దైవదూతలు

ఆది, 12/09/2018 - 16:06

అల్లాహ్ యొక్క సామిప్యం కలిగి ఉన్న నాలుగు దూతలు(జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీల్ మరియు ఇజ్రాయీల్) కాకుండా మిగిలిన కొన్ని ముఖ్యమైన దూతల పేర్లు రివాయతుల ప్రకారం.

దైవదూతలు

1. రాహీల్: అల్లాహ్ ఆదేశం ప్రకారం హజ్రత్ అలీ[అ.స] మరియు ఫాతెమా జహ్రా[స.అ] వివాహం యొక్క ఖుత్‌బహ్ ను చదవిన దూత.[ఉయూను అఖ్బార్ అల్ రిజా[అ.స], షేఖ్ సదూఖ్, భాగం1, పేజీ224]
2. దర్ దాయీల్: ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ]: “దర్దాయీల్ పేరు గల దూతకు పదహారు వేల రెక్కలున్నాయి....”[కమాలుద్దీన్ వ తమూమున్నిఅమహ్, షేఖ్ సదూఖ్, భాగం1, పేజీ282].
3. ఇస్మాయీల్: ఇమామ్ జాఫర్ సాదిఖ్ ఉల్లేఖనం: ఇస్మాయీల్ అనబడే దూత ప్రపంచానికి చెందిన ఆకాశంలో ఉంటాడు. ఎవరైన 7 సార్లు “యా అర్హమర్రాహిమీన్” అని చెబుతాడో ఇస్మాయీల్ అతడితో “కరుణామయుడైన అల్లాహ్ నీ పిలుపును విన్నాడు ఇక నీ కోరికను ఆయనతో కోరుకో” అని అంటాడు.[వసాయిల్ అల్ షియా, హుర్రె ఆములి, భాగం7, పేజీ88].
4. హయవాన్: కడుపులో ఉండే బిడ్డకు నాలుగో నెలలో ఆయువు పోసిన తరువాత అల్లాహ్ ఆ బిడ్డ వైపుకు పంపే దూత పేరు “హయవాన్”[అల్ మహాసిల్, బర్ఖీ, భాగం2, పేజీ315].
5. ౙాజిర్: బిడ్డ తల్లి కడుపులో నుండి సులువుగా బయటకు వచ్చేందుకు సహాయం చేసే దూత.[కాఫీ, కులైనీ, భాగం6, పేజీ15]
6. రిజ్వాన్: “లా సైఫ్ ఇల్లాహ్ ౙుల్ఫిఖార్” అని ప్రకటిస్తూ ఉండే దూత.[అల్ ఇర్షాద్, షేఖ్ ముఫీద్, భాగం1, పేజీ87].
7. హిజ్ ఖాయీల్: 18 వేల రెక్కలున్న ఈ దూత పేరు హిజ్ ఖాయీల్.[రౌౙతుల్ వాయిజీన్, ఫతాలె నైషాబూరీ, భాగం1, పేజీ47].
8. మీఖాయీల్: నమాజీయుల కోసం ప్రతీ నమాజ్ లో నరకాగ్ని నుండి విముక్తి కోరే దూత.[జామివుల్ అఖ్బార్, షయీరీ, పేజీ71].
9. సిజిల్: ఆకాశంలో ఉన్న ఇస్మాయీల్ అనబడే దూత దాసుల కర్మాలను లిఖిస్తాడు, సంవత్సరం అయిన తరువాత అల్లాహ్ అతడి వద్దకు పంపించే దూత పేరు “సిజిల్”[బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం5, పేజీ322]
10. దాయి: అల్లాహ్ 7వ ఆకాశంలో “దాయి” అనబడే దూతను నిర్ధారించెను. రజబ్ మాసం రాగానే ఈ దూత రాత్రి నుండి ఉదయం వరకు “అల్లాహ్ ను స్మరించేవారు మరియు విధేయత కలిగి ఉన్న వారు శ్రేష్ఠులు” అని అంటూ ఉంటాడు.[ఇఖ్బాలుల్ ఆమాల్, ఇబ్నె తావూస్, భాగం2, పేజీ628]
11. ౙిహ్‌లీల్: ఎవరైనా దైవప్రవక్త[స.అ] పై సలామ్ మరియు దురూద్ పంపితే ఈ దూత వాటిని దైవప్రవక్త[స.అ] తెలియపరుస్తాడు, ఆ తరువాత దైవప్రవక్త[స.అ] అతడికి ఆ సలాము యొక్క జవాబును ఇస్తారు.[జమాలుల్ ఉస్బూ, ఇబ్నె తావూస్, పేజీ243].
12. ఈమాన్: ملکا یقال له الإیمان [అల్ సిరాత్ అల్ ముస్తఖీమ్, ఆములి నబాతి, భాగం1, పేజీ156]
13. ౙూఖాబీల్: فبعث اللّه ملکا یقال له زوقابیل [తస్లియతుల్ మజాలిస్, హుసైనీ మూసవీ, భాగం1, పేజీ525]
14. మాలిక్: నరకం యొక్క కాపలాదారుడు.[అల్ జొహ్ద్, కూఫీ అహ్వాజీ, అల్ నస్, పేజీ100]
15. నకీర్ వ మున్కర్: సమాధిలో మృతునితో కలిసే రెండు దూతలు “నకీర్ వ మున్కర్”[అల్ జొహ్ద్, కూఫీ అహ్వాజీ, అల్ నస్, పేజీ88]
16. రూమాన్: సమాధులలో ఉన్న వారిని పరీక్షించే దూత.[సహీఫయే సజ్జాదియా, పేజీ40, నష్ర్ అల్ హాదీ]
17. హారూత్ వ మారూత్: “బాబిల్” పై అవతరించబడ్డ రెండు దూతలు.[బఖరహ్:102].    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9