హజ్రత్ మాసూమహ్[అ.స] యొక్క జ్ఞాన మరియు హదీస్ స్థానం

సోమ, 12/17/2018 - 15:57

ఇరాన్ దేశానికి చెందిన ఖుమ్ అనబడే పట్టణంలో హజ్రత్ మాసూమహ్[అ.స] గారి సమాధి ఉంది వారి యొక్క జ్ఞాన మరియు హదీస్ స్థానం గురించి సంక్షిప్తంగా. 

హజ్రత్ మాసూమహ్[అ.స] యొక్క జ్ఞాన మరియు హదీస్ స్థానం

హజ్రత్ మాసూమహ్[అ.స], జ్ఞానం మరియు హదీస్ ప్రకారం వారి నానమ్మగారైన హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మాదిరి “ఆలిమహ్” మరియు “ముహద్దిసహ్”. ఎలాగైతే హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] బలమైన సాక్ష్యాలతో హజ్రత్ అలీ[అ.స] యొక్క విలాయత్ ను నిదర్శించేవారో అలాగే హజ్రత్ మాసూమహ్[అ.స] కూడా నిదర్శించేవారు. ఆమె ఉల్లేఖించిన హదీసులలో ఎక్కువగా హజ్రత్ అలీ[అ.స] మరియు మిగిలిన ఇమాముల విలాయత్ మరియు ఇమామత్ ను నిదర్శిస్తున్నవే ఉన్నాయి. ఉదాహరణగా: హజ్రత్ మాసూమహ్[అ.స] కొన్ని రావియుల ద్వార హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] హదీస్ ను ఇలా ఉల్లేఖించెను: “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు అలీ ప్రజల నాయకుడు...”[బిహారుల్ అన్వార్, భాగం65, పేజీ77]
అలాగే వారి జ్ఞాన స్థానం గురించి చూసుకున్నట్లైతే చరిత్రలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఒకరోజు షియా వర్గానికి చెందిన ఒక సమూహం మదీనహ్ లో ప్రవేశించారు, కొన్ని ప్రశ్నలకు ఇమామ్ మూసా కాజిమ్[అ.స] వద్దకు వెళ్లి సమాధానం తెలుసుకోవాలని అనుకున్నారు, కాని ఇమామ్ ప్రయాణంలో ఉండడంతో వారి ప్రశ్నలకు హజ్రత్ మాసూమహ్[అ.స] సమాధానాలు వ్రాసి ఇచ్చారు. వారు మదీనహ్ దాటిన తరువాత మార్గం మధ్యలో ఇమామ్ మూసా కాజిమ్[అ.స]తో కలిసారు. ఇమామ్ వారి ప్రశ్నలను మరియు హజ్రత్ మాసూమహ్[అ.స] యొక్క సమాధానాలను చూసి మూడు సార్లు ఇలా అన్నారు: “ఫిదాహా అబూహా” ఆమె తండ్రి ఆమె పై ఫిదా”[కరీమయె అహ్లెబైత్, పేజీ63].

రిఫ్రెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ, బీరూత్, 1403.
మహ్దీపూర్, కరీమయె అహ్లెబైత్, నష్రె హాజిఖ్, ఖుమ్, 1374ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20