దైవప్రవక్త[స.అ] పేరు అహ్మద్

మంగళ, 12/25/2018 - 18:12

దైవప్రవక్త[స.అ] పేర్లలో ప్రసిద్ధి చెందిన పేర్లలో ముహమ్మద్ తో పాటు అహ్మద్ కూడా ఉంది అని నిదర్శిస్తున్న కొన్ని అంశాలు.

దైవప్రవక్త[స.అ] పేరు అహ్మద్

దైవప్రవక్త[స.అ] యొక్క పేర్లలో ఒక పేరు “అహ్మద్”. ఆ పేరుకు సంబంధించి కొన్ని అంశాలు:
1. చరిత్ర ప్రకారం; దైవప్రవక్త(స.అ)కు చిన్నప్పటి నుండి రెండు పేర్లున్నాయి, అందరూ వారికి ఆ రెండు పేర్లతోనూ పిలిచేవారు. ఒకటి “ముహమ్మద్” మరొకటి “అహ్మద్”; మొదటి పేరు వారి పితామహులైన జనాబె “అబ్దుల్ ముతల్లిబ్” పెట్టారు. రెండవ పేరు వారి తల్లి “ఆమినహ్” గారు పెట్టారు. దీని గురించి “సీరయె హలబీ” అన్న గ్రంథంలో వివరంగా ఉంది.
2. దైవప్రవక్త[స.అ]ను అహ్మద్ అని ఎక్కువగా వారి పినతండ్రి హజ్రత్ అబూతాలిబ్[అ.స] పిలిచేవారు. దానికి నిదర్శనం వారి యొక్క కవితాగ్రంథం “దీవానె అబూతాలిబ్” అందులో ఉన్న కవితలో ఎక్కువగా దైవప్రవక్త[స.అ]ను అహ్మద్ అనే గుర్తు చేశారు.
3. అలాగే మిగత కవులు కూడా తమ కవితలలో దైవప్రవక్త[స.అ]ను అహ్మద్ పేరుతోనే గుర్తుచేసేవారు.
4. మేరాజ్ సంఘటనకు సంబంధించిన రివాయత్లలో కూడా అల్లాహ్ దైవప్రవక్త[స.అ]ను అహ్మద్ అని సంబోధించెను అని ఉంటుంది. బహుశ అందుకే నింగిలో వారి పేరు “అహ్మద్” అన్న విషయం ప్రసిద్ధి చెందింది.
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[స.అ] ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ]కు 10 పేర్లున్నాయి; ఐదు పేర్లు ఖుర్ఆన్ లో ఉన్నాయి: “ముహమ్మద్”, “అహ్మద్”, “అబ్దుల్లాహ్”, “యాసీన్” మరియు “నూన్”.
5. దైవప్రవక్త[స.అ] సూరయే సఫ్ యొక్క ఆయతులు మదీనహ్ మరియు మక్కా వాసుల కోసం పఠించినప్పుడు తప్పకుండా అవి యూదులు మరియు క్రైస్తవుల చేవుల వరకు వెళ్ళి ఉంటాయి, వారిలో ఏ ఒక్కరు కూడా “ఇంజీల్”లో వారి పేరు “అహ్మద్” అని చెప్పబడి ఉంది కాని నీ పేరు “ముహమ్మద్” అని ప్రశ్నించలేదు, దీంతో దైవప్రవక్త[స.అ] పేరు “అహ్మద్” అని అందరికి తెలుసు అనే విషయం తెలుస్తుంది; ఒకవేళ వారు అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే చరిత్రలో తప్పకుండా లిఖించబడి ఉండేది.[తఫ్సీరె నమూనహ్, భాగం24, పేజీ89].
ఈ సంభాషణం ద్వార తెలిసిన విషయమేమిటంటే “అహ్మద్” దైవప్రవక్త[స.అ] పేర్లలో ప్రసిద్ధి చెందిన పేరు అని.

రిఫ్రెన్స్
మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్26, 1397ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6