అల్లాహ్ తో హజ్రత్ నూహ్[అ.స] విన్నపం

మంగళ, 12/25/2018 - 18:44

హజ్రత్ నూహ్[అ.స] మరియు వారి జాతి మధ్య జరిగిన సంభాషణ తరువాత హజ్రత్ నూహ్[అ.స] అల్లాహ్ తో చేసిన విన్నపం.

హజ్రత్ నూహ్[అ.స] అల్లాహ్ తో విన్నపం

హజ్రత్ నూహ్[అ.స] జాతి వారు హజ్రత్ నూహ్[అ.స]తో ఇలా అన్నారు: “ఓ నూహ్! మాతో వాదించావు. మరీ మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని(శిక్షను) తీసుకురా”
హజ్రత్ నూస్[అ.స] ఇలా సమాధానమిచ్చారు: “దానిని తెచ్చేవాడు కూడా అల్లాహ్ యే – ఆయన గనక తలచుకుంటే (తెచ్చి తీరుతాడు). మీరు మాత్రం ఆయన్ని ఓడించలేరు. అల్లాహ్ మిమ్మల్ని అపమార్గాన వదిలేయదలచుకుంటే నేను మీ శ్రేయాన్ని ఎంతగా అభిలాషించినా నా శ్రేయోభిలాష మీకేవిధంగానూ ఉపకరించదు. ఆయనే మీ అందరి ప్రభువు. ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు”[హూద్:32-34].
హజ్రత్ నూహ్[అ.స] అల్లాహ్ తో ఇలా విన్నవించుకున్నారు: “నా ప్రభూ! నేను నా జాతివారిని రెయింబవళ్లూ నీ వైపు పిలిచాను కాని నా పిలుపు వారి పలాయనాన్ని మరింత పెంచింది. నీ క్షమాభిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో పెట్టుకున్నారు. తమ వస్త్రాలను తమ పైన కప్పుకున్నారు. మరీ మొండి ఘటాలుగా మారిపోయారు. మహా గర్విష్టుల్లా ప్రవర్తించారు. మరి నేను వారిని బహిరంగంగా (లేక బిగ్గరగా) పిలిచాను. ఆపైన నేను వారికి బహాటంగా కూడా బోధపరచాను. రహస్యంగా (ఏకాంతంలో) కూడా విడమరచి చెప్పాను. నేనిలా అన్నాను – క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు”[నూహ్:5-12].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15