హజ్రత్ నూహ్[అ.స] యొక్క దూషణం

బుధ, 12/26/2018 - 05:59

హజ్రత్ నూహ్[అ.స] చాలా కాలం వరకు వారి జాతివారికి ఎకేశ్వరవాదం వైపు పిలుపునిచ్చిన తరువాత వారి జాతివారి ధిక్కరణ చూసి హజ్రత్ నూహ్[అ.స] వారిని దూషించారు.

హజ్రత్ నూహ్[అ.స] యొక్క దూషణం

అల్లాహ్ తరపు నుండి అవతరించబడిన ప్రతీ ప్రవక్తను వారి జాతి వారు ధిక్కరించేవారు అని అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “నూహ్ జాతి వారు కూడా (తమ ప్రవక్తను) ధిక్కరించారు. వారు మా దాసుణ్ణి త్రోసిపుచ్చి, అతణ్ణి “పిచ్చోడు” అన్నారు. అతన్ని విదిలించారు”[ఖమర్:9].
హజ్రత్ నూహ్[అ.స] జాతి వారు వారిని రాళ్ళతో కొట్టి చంపుతామని బెదిరించారు. ఖుర్ఆన్ వారి మాటలను ఇలా సూచించెను: “వారిలా పలికారు: “ఓ నూహ్! నువ్వు గనక (ఈ పనిని) మానుకోకపోతే, నిన్ను రాళ్ళతో కొట్టడం (చంపటం) ఖాయం”[షుఅరా:116].
అప్పుడు హజ్రత్ నూహ్[అ.స] ఇలా ప్రార్థించారు: “నా ప్రభూ! నా జాతివారు నన్ను ధిక్కరించారు. కాబట్టి నీవు నాకూ – వారికీ మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులనూ కాపాడు”
అల్లాహ్ హజ్రత్ నూహ్(అ.స) యొక్క ప్రార్థనను అంగీకరించి ఆ జాతిని తుఫాను ద్వార శిక్షించాము. దీనిని సూచిస్తూ ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “మేము అతన్నీ, అతని సహచరులను నిండు నౌకలో (ఎక్కించి) కాపాడాము. ఆ తరువాత మిగిలివున్న వారందరినీ మేము ముంచి వేశాము”[షుఅరా:117-120].  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25