ఆయతుల్లాహ్ షేక్ బాఖిర్ నిమ్ర్ జీవిత చరిత్ర

బుధ, 01/02/2019 - 06:49

సౌదీ అరేబీయ అన్యాయాలకు ఎదురుతిరిగిన పులి ఆయతుల్లాహ్ షేక్ బాఖిర్ నిమ్ర్ సంక్షిప్త జీవిత చరిత్.ర

ఆయతుల్లాహ్ షేక్ బాఖిర్ నిమ్ర్ జీవిత చరిత్ర

షేక్ బాఖిర్ అల్ నిమ్ర్, 1968 లో “ఖతీఫ్” పట్టణంలో ఒక మంచి మరియు విధ్వాంసుల కుటుంబంలో జన్మించారు. అతని కుటుంబంలో ఉపధ్యాయుల సంఖ్య ఎక్కువ. అతను 1989 లో ఇస్లాం విధ్యాభ్యాసం కొరకు “ఇరాన్”కు వచ్చారు. అక్కడే పది సంవత్సరాలు విద్యను అభ్యాసించారు. ఆ తరువాత “షామ్”కి వెళ్ళి అక్కడ ఇస్లామీయ విద్యాలయంలో “హౌజయే ఇల్మియయే సయ్యదా జైనబ్[స.అ]” లో చేరారు.
ఇరాన్, ఇరాక్ మరియు షామ్ కు చెందిన గొప్ప గొప్ప ఉలమాల నుండి విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత అతనికి పలు ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలలో విధ్యాబోధనకు అనుమతి ఇవ్వబడింది. షేక్ నిమ్ర్ ఇప్పటి కాలంలో ఇస్లాం యొక్క మంచి ఆచార్యులలో ఒకరుగా ఉండేవారు. ఇరాన్ మరియు షామ్ లో ఇస్లాం యొక్క ప్రాచీన గ్రంథాలను బోధించేవారు. అలాగే ఎన్నో సంవత్సరాలు “హౌజయే ఇల్మియయే హజ్రత్ ఖాయం[అ.స]” అనబడే విద్యాలయం ఎదుగుదలకు ముఖ్యకారణం వీరే.
వారు సౌదీ అరేబియాకు వెళ్ళి “అల్ అవామియా”లో “అల్ ఇమామ్ అల్ ఖాయం[అ.స]” అను ఒక కేద్రాన్ని 2001లో స్థాపించారు. వారు మంచిస్వభావం గల వ్యక్తి. ఇస్లాం ఉపదేశాల గౌరవాన్ని నిలబెట్టడానికి ఎట్టిపరిస్థితులలోనైనా వెనకాడేవారు కాదు. వారి ఈ పధ్ధతులే సౌదీ అరేబియా యొక్క అన్యాయం మరియు దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలిచాయి.
సౌదీ అరేబియా లో జరుగుతున్న సంఘటనల గురించి వాళ్ల స్థతి గతుల గురించి “షేక్ నిమ్ర్”కు పూర్తి అవగాహన ఉండేది అందుకే వారు చెప్పే మాటలు గట్టి సాక్ష్యాలతో కూడి ఉండేవి.
షేక్ నిమ్ర్ 2006 మరియు 2008 లో సౌదీ యొక్క కారాగాములలో బందీగా ఉన్నారు. ఒకసారి బెహ్రైన్ లో జరిగిన అంతర్జాతీయ ఖుర్ఆన్ సభలో పాలుగోని స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఇంతకు ముందు సౌదీ అధికారులతో “జన్నతుల్ బఖీ” యొక్క నిర్మాణానికి మరియు అహ్లెబైత్[అ.స]ల మార్గాన్ని రాజ్యంగపరంగా శ్వీకరించాలనే; అంశాలను కోరినందుకు. మరియు అలాగే సౌదీ యొక్క విద్యాభ్యాస పధ్ధతిని మార్చివేయాలి లేదా పూర్తిగా రద్దుచేసి కొత్త పధ్ధతిని తీసుకొని రావాలి; అని కోరినందుకు అరెస్టు చేశారు. ఆ తరువాత 2008 “ఖతీఫ్” అను పట్టణంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా షియా ముస్లింలను తయారు చేస్తున్నారనే విషయం పై అరెస్టు చేశారు.
సర్వథా సౌదీ పాలకులకు తెలుసు అతని పై వేసిన నిందలన్ని నిజమైనవి కావు అని. అందుకే అతన్ని 24 గంటలు జైలులో ఉంచి వదిలేసేవారు. 2009 లో కూడా చాలా కొద్ది కాలం బందించబడ్డారు.
చివరికి సౌదీ న్యాయవ్యవస్థ అతనికి మరణ శిక్ష ఉత్తర్వులు జారి చేసింది. అప్పటి నుండి ఇస్లాం మతవాదులు మరియు ప్రముఖ ఉలమాలు, సౌదీ పాలకుల ఈ ఆదేశం పై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నో దేశాలు సౌదీ పాలకుల ఈ ఆదేశానికి వ్యతిరేకంగా తన భావాన్ని ర్యాలీ రూపంలో వ్యక్తం చేశారు. కాని జనవరి నెల 2వ తారీకు 2016లో “షేక్ బాఖిర్ నిమ్ర్” మరణ శిక్షను అమలులోకి తెచ్చారు.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Mirza on

Thanks for brief about Baqrul nimr sb.
We should remember his shahadat.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22