.ఖుర్ఆన్ యొక్క మూడవ సూరా అలెఇమ్రాన్ గురించి సంక్షిప్తంగా.
ఖుర్ఆను యొక్క మూడవ సూరా ఇది. "ఆలె ఇమ్రాన్" అనగ ఇమ్రాన్ యొక్క సంతానం. ఈ సూరా పేరుకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోనే ఉన్న 33వ ఆయత్. ఈ సూరా మొత్తానికి అలె ఇమ్రాన్ అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 3 సార్లు వచ్చింది. ఈ సూరాలో 200 ఆయత్ లు, 3500 పదాలు మరియు 14984 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో "అల్లాహ్" పదం 209 సార్లు వచ్చింది. ఈ సూరా మదీనహ్ లో అవతరించబడింది. ఈ సూరా కన్న ముందు "అన్ఫాల్" సూరా మరియు తరువాత "అహ్జాబ్" సూరా అవతరించబడ్డాయి. ఈ సూరాకు అలె ఇమ్రాన్ పేరే కాకుండా "తయ్యిబహ్" అని ఇంకో పేరు కూడా ఉంది. ఇందులో ఇమ్రాన్ యొక్క సంతానం సంఘటన వివరణ ఉంది అందుకని దీనిని ఆలె ఇమ్రాన్ అని అంటారు. "ముబాహిలా" సందర్భంలో అవతరించబడ్డ ఆయత్ ఈ సూరాలోనే ఉంది. దైవప్రవక్త[స.అ] వచనానుసారం: "ఎవరైతే బఖరహ్ మరియు ఆలెఇమ్రాన్ సూరాలను పఠిస్తారో అవి ప్రళయంనాడు అతడినికి నీడనిస్తాయి".[నూరుస్సఖ్లైన్, భాగం1, పేజీ26].
రిఫ్రెన్స్
హువైజీ, నూరుస్సఖ్లైన్, భాగం1, పేజీ26
వ్యాఖ్యానించండి