హజ్రత్ ఫాతెమా[స.అ] పేర్లు ఇమామ్ ఖుమైనీ[ర.అ] మాటల్లో

సోమ, 01/21/2019 - 15:26

సరైన హదీసు ప్రకారం హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ]కు అల్లాహ్ వద్ద తొమ్మిది పేర్లున్నాయి వాటి గురించి ఇమామ్ ఖుమైనీ[ర.అ] అభిప్రాయం.

హజ్రత్ ఫాతెమా[స.అ] పేర్లు ఇమామ్ ఖుమైనీ[ర.అ] మాటల్లో

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] గారికి చాలా పేర్లున్నాయి; వారి పేర్లు అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడినవి. హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[స.అ] ఉల్లేఖనం: “అల్లాహ్ వద్ద హజ్రత్ ఫాతెమా[స.అ] కై 9 పేర్లున్నాయి: 1. ఫాతెమా 2. సిద్దీఖహ్ 3. ముబారకహ్ 4. తాహిరహ్ 5. జకియ్యహ్ 6. రాజియహ్ 7. మర్ జియహ్ 8. ముహద్దిసహ్ 9. జహ్రా”.
ఈ పేర్లలో ప్రతీ ఒక్క పేరు మానిషిలో ఉండాల్సిన ఒక్కొక్క మంచి స్వభానికి ప్రతీక. ఇమామ్ ఖుమైనీ[ర.అ] తమ ఉల్లేఖనలలో హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] గారి పేర్లు మరియు బిరుదులలోని కొన్ని వాటిని తరచూ పలుకుతూ ఉండేవారు వాటి నుండి: ఫాతెమా, జహ్రా, మర్జియా, తాహిరహ్, కౌసర్. కొన్ని సందర్భాలలో రెండుపేర్లను కలిపి ఉపయోగించేవారు ఉదాహారణకు “సిద్దీఖహ్ తాహిరహ్” “ఫాతెమా జహ్రా” లేదా “జహ్రాయే మర్జియా” మొ.. ఆ పేర్లలో ఒకపేరును చాలా ప్రాముఖ్య ఇచ్చేవారు. సరైన రివాయత్ ప్రకారం హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క గొప్ప ప్రతిష్టతను వెల్లడించే ఆ పేరుకు కారణం జిబ్రయీల్ నిరంతరం అవతరణ.
దైవప్రవక్త(స.అ) మరణాంతరం, హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] నిరంతరం దుఖంలో మునిగిఉండేవారు, అందుకని అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జిబ్రయీల్ దిగివచ్చి ఆమెకు భవిష్యత్తు వార్తలను తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] “ముహద్దిసహ్” అని పిలవబడ్డారు.[సహీఫయె ఇమామ్, భాగం20, పేజీ4]. ముహద్దిసహ్ అనగా దైవదూతలు మాట్లాడేవారు.  

రిఫ్రెన్స్
ఇమామ్ ఖుమైనీ, సహీఫయె ఇమామ్, 22సంపుటాలు, మొఅస్ససయే తన్జీమ్ వ నష్రె ఆసారె ఇమామ్ ఖుమైనీ, 1378ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16