ముహద్దిసహ్

సోమ, 01/21/2019 - 15:54

"ముహద్దిసహ్" హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స] యొక్క పేరు. ఆ పేరుకు కారణం గురించి ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] హదీస్ వివరణ.

ముహద్దిసహ్

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క పేర్లలో ఒక పేరు “ముహద్దిసహ్” అనగా అల్లాహ్ ఆజ్ఞతో దైవదూతలు దిగివచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవారు. దీనికి నిదర్శనం ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క సరైన ఈ హదీస్ యే నిదర్శనం:
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: “ఫాతెమా[స.అ]ను “ముహద్దిసహ్” అంటారు, దానికి కారణం దైవదూతలు నింగి నుండి దిగివచ్చేవారు, ఎలాగైతే ఇమ్రాన్ కూతురు హజ్రత్ మర్యమ్[అ.స]తో మాట్లాడేవారో అలాగే హజ్రత్ జహ్రా[స.అ]తో మాట్లాడేవారు. దైవదూతలు హజ్రత్ జహ్రా[స.అ]తో ఇలా చెప్పేవారు: :ఓ ఫాతెమా! అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పవిత్రతను ప్రసాదించాడు, నిన్ను సర్వలోకపు స్ర్తీలలో ఉత్తమ స్ర్తీగా నిర్ధారించాడు. ఓ ఫాతెమా! అల్లాహ్ పట్ల విధేయతగా ఉండు, రుకూ చేయువారితో పాటు రుకూ మరియు సజ్దా చేయి”. హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] దైవదూతలతో మాట్లాడేవారు వారు ఆమెతో మాట్లాడేవారు. ఒకరోజు రాత్రి హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ], దైవదూతలలో ఇలా ప్రశ్నించారు: “ప్రపంచపు ఉత్తమ స్ర్తీ హజ్రత్ మర్యమ్ బింతె ఇమ్రాన్[అ.స] కాదా? అప్పుడు దైవదూతలు ఇలా చెప్పారు: “హజ్రత్ మర్యమ్, వారి కాలపు స్ర్తీలకు నాయకురాలు, కాని అల్లాహ్ మిమ్మల్ని సర్వలోక ఉత్తమ స్ర్తీగా నిర్ధారించెను. మీ కాలంలో, హజ్రత్ మర్యమ్ కాలంలో మరియు మొదటి నుండి చివరి దాక స్ర్తీలందరికి మీరే నాయకురాలు”[బిహారుల్ అన్వార్, భాగం14, పేజీ206].

రిఫ్రెన్స్
అల్లామ మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుల్ ఎహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ, ఆఫ్సేట్, 1403హి.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7