జిబ్రయీల్ అవతరణకు కారణం

సోమ, 01/21/2019 - 16:15

జిబ్రయీల్ అవతరణకు కారణం ఏమిటి అన్న విషయం పై ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) యొక్క వివరణ.

జిబ్రయీల్ అవతరణకు కారణం

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] గారి రివాయత్ ప్రకారం హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క అతిగొప్ప ప్రతిష్టతను ఇమామ్ ఖుమైనీ[ర.అ] ఇలా వివరించారు.. నేను హజ్రత్ సిద్దీఖహ్[స.అ] గురించి ప్రస్తావించే అర్హతగలను అని నేను భావించను, కేవలం “అల్ కాఫీ” గ్రంథంలో ఉన్న ఒక సరైన రివాయత్ గురించి చెబుతాను.  ఆ రివాయత్ ఏమిటంచే హజ్రత్ ఇమామ్ సాదిఖ్[అ.స] ఇలా ఉల్లేఖించారు: “ఫాతెమా[స.అ] వారి తండ్రి మరణాంతరం ఈలోకంలో 75 రోజులు ప్రాణాలతో ఉన్నారు, దుఖం యొక్క ప్రభావం ఎక్కువయ్యేది మరియు జిబ్రయీల్ దిగివచ్చి వారికి పరామర్శించేవారు మరియు భవిష్యత్తు వార్తలను తెలియపరిచేవారు” ఈ రివాయత్ ద్వారా తెలిసే విషయమేమిటంటే జిబ్రయీల్ చాలా సార్లు దిగివచ్చేవారు. నిస్సందేహముగా ప్రవక్తలలో మొదటి తరగతి ప్రవక్తలకు తప్ప మరొకరి గురించి ఇలా అవ్వలేదు; 75 రోజుల వ్యవధిలో జిబ్రయీల్ నిరంతరం దిగిరావడం, భవిష్యత్తు వార్తలు చెప్పడం మరియు వాటిని హజ్రత్ అమీరుల్ మొమినీన్[అ.స] వ్రాసేవారు...,
జిబ్రయీల్ దిగిరావడం సాధారణమైన విషయం కాదు. జిబ్రయీల్ ప్రతీ ఒక్కరికి దిగివస్తారని అనుకోకండి. దానికి ఆత్మతో ఒక అనుకూలత మరియు పోలిక ఉండాలి జిబ్రయీల్ దిగిరావాలంటే, గొప్ప ఆత్మ స్థానం జిబ్రయీల్ ది. మనిషి ఆత్మ మరియు జిబ్రయీల్ ఆత్మ మధ్య అనుకూలత లేకపోతే జిబ్రయీల్ దిగిరావడం అసంభవం. ఈ అనుకూలత జిబ్రయీల్ యొక్క ఆత్మ మరియు పైస్థానంలో ఉన్న మొదటి తరగతి ప్రవక్తల (ఉదా: దైవప్రవక్త, మూసా, ఈసా, ఇబ్రాహీమ్[అ.స] మొ..) మధ్య ఉండేది, ప్రవక్తలందరి వద్ద ఉండేది కాదు. ఆ తరువాత హజ్రత్ ఫాతెమా[స.అ]లో ఆ అనుకూలత ఉంది అందుకే జిబ్రయీల్ నిరంతరం 75రోజులు దిగివచ్చి భవిష్యత్తు వార్తలను తెలిపేవారు...,
నేను హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క ఈ ప్రతిష్టతను మిగితా ప్రతిష్టతలన్నీంటి కన్నా గొప్ప ప్రతిష్టతగా భావిస్తాను. ఇది కేవలం అల్లాహ్ యొక్క అతిసామిప్యం కలిగి ఉన్న దాసులకు మాత్రమే సొంతమౌతుంది, ఇతరులకు దక్కదు. ఇది హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ప్రత్యేక ప్రతిష్టతల నుండి ఒకటి.[సహీఫయె ఇమామ్, భాగం20, పేజీ6].

రిఫ్రెన్స్
ఇమామ్ ఖుమైనీ, సహీఫయె ఇమామ్, 22సంపుటాలు, మొఅస్ససయే తన్జీమ్ వ నష్రె ఆసారె ఇమామ్ ఖుమైనీ, 1378ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16