నాలుక(నోరు) గురించి హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] హదీసు నిదర్శనంగా కొన్ని మాటలు.
మనిషుల మధ్య సంబంధాన్ని ఎర్పరిచేది, ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలియపరిచేది, మనిషి శరీరంలోని ముఖ్యభాగం నాలుక(నోరు). ఒకవేళ సరైన సమయంలో సరైన విషయం కోసం దానిని మెదపకపోతే మనిషిపై దాని అధికారం ఇతర అవయవాల కన్న ఎక్కువ అవుతుంది, కాని అదే అదుపులో ఉంచి, ఆచితూచి మాట్లాడడం వల్ల మనిషి మెల్ల మెల్లగా తన నోరుని కట్రోల్ లో తీసుకుంటాడు, అప్పుడు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అర్థపర్ధం లేని మాటలు మాట్లాడడు. అలాగే అతిమౌనానికి కూడా గురి కాకుండా యదార్ధం చెప్పడానికి వెనకాడడు.
ఆలోచించి మాట్లాడేవారి గురించి మరియు అలోచించకుండా మాట్లాడేవారి గురించి ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: “బుద్ధిమంతుడి నాలుక(నోరు) అతడి హృదయం(బుద్ధి) వెనక మరియు మూర్ఖుడి హృదయం అతడి నాలుక వెనుక ఉంటుంది”[నెహ్జుల్ బలాగహ్, హిక్మత్40]
ఇదే విధంగా ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] కూడా ప్రవచించారు: “మూర్ఖుడి హృదయం(బుద్ధి) అతిడి నోరులో మరియు బుద్ధిమంతుడి నోరు అతడి హృదయంలో ఉంటుంది”[బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ374].
రిఫ్రెన్స్
నెహ్జుల్ బలాగహ్ మరియు బిహారుల్ అన్వార్.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... Iltemase Dua.
వ్యాఖ్యానించండి