ఆలోచన ఫలితం

బుధ, 01/23/2019 - 09:34

ఆలోచన ద్వార అంతర్ దృష్టి ప్రాణాలతో ఉంటుంది. మనిషి యొక్క అంతర్ దృష్టి సరిగా ఉంటే మనిషి ఎక్కడున్నా సద్గుణాలకు ప్రతీకగా ఉంటాడు.

ఆలోచన ఫలితం

బుద్ధిమంతుడు మాట్లాడే ముందు ఆలోచిస్తాడు, దాని ఫలితాల గురించి విచారిస్తాడు ఆ తరువాత మాట్లాడతాడు కాని మూర్ఖుడు ముందు మాట్లాడేస్తాడు, ఆ తరువాత దాని ఫలితాల గురించి ఆలోచిస్తాడు. అందుకని బుద్ధిమంతుడి తప్పులు తక్కువగా మరియు మూర్ఖుడి ఓప్పులు తక్కువగా ఉంటాయి. దానికి కారణం., ఆలోచన వల్ల మనిషి యొక్క ఆత్మ మరియు బుద్ధి స్పష్టం అనే కాంతిని పొందుతాయి, బుద్ధిమంతుడు ఆ కాంతి ద్యారా సత్యఅసత్యాల మరియు తప్పుఓప్పుల మధ్య గల బేధాన్ని తెలుసుకుంటాడు కాని మూర్ఖుడు అజ్ఞానపు చీకటిలో ఉండిపోయి సత్యఅసత్యాల మరియు తప్పుఓప్పుల మధ్య గల బేధాన్ని తెలుసుకోలేక మార్గభ్రష్టుడిగా మిగిలిపోతాడు. అందుకే ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించారు: “బాగా ఆలోచించే వాడు ఫలితాన్ని చూడగలడు”[గురరుల్ హికమ్, భాగం5, పేజీ324, హదీస్8577].
ఇమామ హసన్[అ.స] ఇలా ప్రవచించారు: “బాగా ఆలోచించండి, ఎందుకంటే ఆలోచన అంతర్ దృష్టి యొక్క హృదయానికి జీవం మరియు వివేకం యొక్క ద్వారాల తాళం చెవి”[బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ115, హదీస్12].

రిఫ్రెన్స్
గురరుల్ హికమ్, బిహారుల్ అన్వార్.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4