నాలుక ద్వార మనిషికి కలిగే లాభాలు మరియు నష్టాలు మిగత అవయవాల కన్న ఎక్కువ.
నాలుక ద్వార ఎన్ని లాభాలున్నాయే అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయి, దాంతో మంచి ఎంత ఉందో చెడుకూడా అంతే ఉంది, అది మంచి ప్రభావమూ వేస్తుంది మరియు చెడు ప్రభావమూ వేస్తుంది, ప్రజల మధ్య సందీ చేయిస్తుందీ మరియు జగడానికి కూడా దారి తీస్తుంది, స్నేహం చేయిస్తుంది మరియు శత్రుత్వానికి కూడా కీలకపాత్ర వహిస్తుంది, అల్లాహ్ ను స్మరిస్తుందీ మరియు చాడీలూ తప్పుడు సాక్ష్యాలూ దూషణం వంటి నీఛపనులు కూడా చేస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే దాని ద్వార సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల విధేయతగా ఉండవచ్చు మరియు అవిధేయతను కూడా వ్యక్తం చేయవచ్చు. శరీరం యొక్క ఇతర భాగల నుండి తక్కువ పాపములు అవుతాయి కాని నాలుక మనిషి యొక్క కనిపించని భాగం అయినా ఎక్కువ శాతం పాపాలు దానితోనే జరుగుతాయి. దాని ప్రభావాల హద్దులు చాలా విస్తృతమైనవి, అవి మనిషికి కూడా అంతుపట్టనివి.
దైవప్రవక్త ఇలా ఉల్లేఖించారు: “ఆదమ్ సంతతి నుండి సంభవించే ఎక్కవ పాపాలకు కారణం నాలుక”[నెహ్జతుల్ ఫసాహ, హదీస్5081]. మనిషి తన నాలుకను అదుపులో పెట్టుకుంటే, ఇహపరలోకాల ఎన్నో కష్టాల నుండి సురక్షితంగా ఉండి సుఖమైన జీవనాన్ని గడపవచ్చు.
రిఫ్సెన్స్
అబుల్ ఖాసిమ్ పైమానీ, నెహ్జుల్ ఫసాహ్, ఇంతెషారాతె ఖాతముల్ అంబియా, ఇస్ఫెహాన్, 1385ష
వ్యాఖ్యలు
Mashallah.
Shukriya... Iltemase dua..
వ్యాఖ్యానించండి