ఐదు పూట్ల నమాజుకు గల కారణాలు

శని, 01/26/2019 - 06:08

ఒక ముస్లింపై ఐదు పూటలు నమాజు ఎందుకు విధిగా చేయబడినది, దానికి గల కారణాలు ఎమిటి అనే అంశాలను ఈ క్రింధి వ్యాసంలో వివరించడం జరిగింది.

ఐదు పూట్ల నమాజుకు గల కారణాలు

ప్రతీ ముస్లింపై ఐదు పూట్ల నమాజు విధిగా చేయటం జరిగింది, ఎందుకంటే విశ్వాసికి మరియు అవిశ్వాసికి మద్య వారిధరిని వేరు చేసే సరిహద్దు కూడా నమాజే,కానీ ఈ నమజును ఐదుపూటలు ఎందుకు చేయాలి? దానికి గల కారణం ఎమిటి అన్న సందేహం అందరికి ఉంటుంది.
మహనీయ ప్రవక్త అదే కారణాన్ని ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు:
ఫజ్ర్ నమాజు:
సూర్యోదయ సమయం షైతాను తన కార్యాలు ఆరంభించే సమయం ఎవరైతే ఆ సమయంలో నమాజు చేసి దేవుని సామిప్యాన్ని కోరుకుంటారో వారు షైతాను బారిన పడకుండా ఆ అల్లాహ్ శరణులో ఉంటారు.
జొహ్ర్ నమాజు:
భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్ని ఆ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి, కానీ నా అనుచరులు ఆ కార్యము నుండి(దేవుని స్తుతి నుండి) దూరంగా ఉండటం సరియైనది కాదు, మరియు జొహ్ర్ యొక్క సమయం నరకవాసులు నరకంలో ప్రవేశించే సమయం కూడా, ఎవరైతే ఈ సమయాన్ని దైవారాధనలో గడుపుతారో వారు నరకానికి దూరంగా ఉంచబడతారు.
అస్ర్ నమాజు:
అస్ర్ యొక్క సమయం ఆదం మరియు హవ్వాల వారు పొరబడిన సమయం (షైతాను పెడత్రోవ పట్టించిన సమయం) ఈ సమయంలో నమాజు చేసి మాపై మోపబడిన నిందను తొలగిస్తూ ఆ దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాము అని తెలియపరుస్తాము.
మగ్రిబ్ నమాజు:
మగ్రిబ్ సమయం అల్లాహ్ ఆదం యొక్క పశ్చాత్తాపాన్ని ఆమోదించిన సమయం, దానికి కృతజ్ఞతగా మేము ఈ సమయంలో నమాజు చేస్తాము.
ఇషా నమాజు:
సర్వేశ్వరుడైన అల్లాహ్ నా అనుచరుల సమాధిలో వెలుగు మరియు సుఖాన్ని కలుగజేయాలని ఇషా నమాజును విధిగా చేయటం జరిగింది.[ఇలలుష్ షరాయె, పేజీ నం: 337.]

రెఫరెన్స్
ఇలలుష్ షరాయె, షేఖ్ సదూఖ్, పేజీ నం: 337.

   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Ameen Abbas on

Very useful information, jazakallha great work. Khuda khubool kare inshallah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13