ఇస్లామీయ విప్లవానికి కారణం ఎవరు? ఒక వ్యక్తి చేసిందా లేక ఒక సమూహం చేసిందా? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? అన్న విషయాల పై సంక్షిప్త వివరణ.
ఇరాన్ ఇస్లామీయ విప్లవం, యావత్ ప్రపంచానికి కదిలించి వేసింది. తూర్పు నుండి పడమర వరకు ప్రతీ ఒక్కరి నోట ఒకే విప్లవ చర్చ, అదే ఇస్లామీయ విప్లవ చర్చ. ఇదంతా ఎవరు చేశారు? ఈ విప్లవాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఏ ఒక్క ఇరాన్ దేశస్తుడు చెప్పగలడా “ఔను నేనే స్వాతంత్రాన్ని తీసుకొచ్చాను, విప్లవాన్ని తీసుకొచ్చాను" అని? నిస్సందేహంగా ఇలా వ్యాజించలేడు. ఈ మార్పూ, ఈ విప్లవం కేవలం దైవికమైన విప్లవం. అల్లాహ్ యే ఈ విప్లవాన్ని తీసుకొచ్చాడు. అందుకనే ఏ ఒక్కడు కూడా ఈ విప్లవానికి తానే కారణంగా చెప్పుకోడు, చివరికి ఎంతో ప్రతిష్టతగల మరియు సాటిలేని త్యాగలు చేసిన ఇమామ్ ఖుమైనీ[ర.అ] కూడా ఈ విప్లవానికి కారణంగా చెప్పుకోలేదు. నిరంతరం “ఈ విప్లవం ఇరానీయుల యొక్క నిష్కపట మరియు శ్రమతో కూడిన ప్రయత్నాలకు ఫలితం” అని చెప్పేవారు. ఈ మాటలను పరిశీలిస్తే ఇమామ్ ఖుమైనీ[ర.అ] సరిగ్గా చెప్పారు అని తెలుస్తుంది. నిజానికి ఇమామ్ ఖుమైనీ[ర.అ] ప్రజలకోసం కేవలం ఒక జరియా మరియు దైవిక సాధనము మాత్రమే ఈ ఇస్లామీయ విప్లవానికి ప్రధానం అల్లాహ్ యే ఎందుకంటే ఇరానీయులు స్వచ్ఛతతో, నిష్కపటముగా మరియు అల్లాహ్ మార్గంలో ఇస్లామీయ విప్లవానికి ముందడుగు వేశారు అందుకని అల్లాహ్ ఆజ్ఞ మరియు దయ కూడా వారికి తోడయ్యింది. ప్రజల స్వచ్ఛత వలనే అల్లాహ్ ఈ ఇస్లామీయ విప్లవాన్ని తాయీదు చేశాడు.(అఖ్లాఖ్ వ మానవియత్).
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ ఖామెనయి, అఖ్లాఖ్ వ మానవియత్.
వ్యాఖ్యానించండి