ఫాతెమా జహ్రా[స.అ] తస్బీహ్ యొక్క ప్రయోజనాలు

ఆది, 01/27/2019 - 17:44

హజ్రత్ ఫాతిమ జహ్రా[స.అ] తస్బీహ్ యొక్క ప్రాముఖ్యత పవిత్ర మాసూముల హదీసులలో.

ఫాతెమా జహ్రా[స.అ] తస్బీహ్ యొక్క ప్రయోజనాలు

నమాజు చేసిన వెంటనే తస్బీహ్(ఆ అల్లాహ్ పవిత్రతను కొనియాడటం) పఠించడం, హదీసులలో చాల తాకీదు చేయటం జరిగింది మరియు కొన్ని హదీసులలో అది తప్పనిసరి అని కూడా వివరించడం జరిగింది.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: "ఓ అబూ హారూన్! మనము ఎలగైతే మన పిల్లలను నమాజు చేయమని ఆదేశిస్తామో అలాగే తస్బీహ్ ఫాతిమా జహ్రా[స.అ] కొరకు కూడా ఆదేశించాలి, ఈ భగవంతుని స్తుతిపై ద్రుఢసంకల్పాన్నీ కలిగి ఉండాలి, ఎవరైతే ఈ తస్బీహ్ పఠిస్తూ ఉంటారో దారిద్ర్యానికి దూరంగా ఉంటారు.
ఇమాం మొహమ్మద్ బాఖిర్[అ.స]ల వారు ఈ విధంగా పలికారు: ఎవరైతే తస్బీహ్ ఫాతిమా[స.అ] చేసి తమ పాపాల ప్రాయశ్చితాన్ని కోరుకుంటారో వారి పాపాలు మన్నించబడతాయి ఈ తస్బీహ్ నోటి ద్వారా వంద సార్లు మాత్రమే కానీ అది వెయ్యి సార్లుగా లెక్కింపబడుతుంది మరియు షైతాన్ ను దూరంగా చేసి ఆ కరుణామయుడైన అల్లాహ్ సంతోషాన్ని సమకూరుస్తుంది.
వేరే చోట ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే విధిగా చేయబడిన నమాజుల తరువాత తస్బీహే ఫాతిమా[స.అ] చేస్తారో వారు తమ కుడి కాలును ఎడమ కాలుపై నుండి తీసే లోపే వారి అన్ని పాపాలు మన్నించబడతాయి.

రెఫరెన్స్:
ఉసూలె కాఫీ, 3వ భాగం, పేజీ నం:343, మఆనియుల్ అఖ్బార్, పేజీ నం:193.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8