దైవప్రవక్త[స.అ] శాపానికి గురి అయిన మర్వాన్ తండ్రి హకమ్ ఇబ్నె అబిల్ ఆస్ గురించి సంక్షిప్త వివరణ.
మర్వాన్ తండ్రి పేరు “హకమ్ ఇబ్నె అబిల్ ఆస్” ఇతడు ఉస్మాన్ ఇబ్నె అఫాన్ యొక్క పినతండ్రి. దైవప్రవక్త[స.అ]ను హెళన చేసే వాళ్ళలో ఇతనొకడు. దైవప్రవక్త[స.అ]ను వెనక కాళ్ళూచేతులు ఆడిస్తూ వారిని అనుకరించేవాడు. దైవప్రవక్త[స.అ]ను హేళన చేస్తుండగా అతడు దైవప్రవక్త[స.అ] కంటబడ్డాడు, అప్పుడు వారు “ఇలాగే చేస్తూఉండిపో” అన్నారు, అప్పటి నుండి చచ్చేంత వరకు పక్షవాతం వచ్చి కాళ్ళూ చేతులు తన ప్రమేయం లేకుండా కదులుతూనే ఉండేవి.
దైవప్రవక్త[స.అ] సభలో ప్రవేసించడానికి అతడు అనుమతి కోరినప్పుడు అతడి గొంతును గుర్తు పట్టి దైవప్రవక్త[స.అ] ఇలా అనే వారు: “ప్రవేసించడానికి అనుమతి ఇవ్వండి, అల్లాహ్ దూషణం ఇతడి మరియు ఇతడి సంతానం పై పడుగాక, విశ్వాసులు తప్ప. వాళ్ళు కపటవర్తనులు, మోసగాళ్ళు”.
దైవప్రవక్త[స.అ] అతడిని “తాయిఫ్” ప్రదేశానికి బహిష్కరించారు. అబూబక్ర్ మరియు ఉమర్ ఖిలాఫత్ అధికార కాలంలో ఉస్మాన్ తన పినతండ్రి అయిన హకమ్ ను మదీనకు తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వమని కోరారు కాని వాళ్ళిద్దరూ దైవప్రవక్త[స.అ] ఆదేశాన్ని వ్యతిరేకించడానికి ఒప్పుకోలేదు, కానీ ఖిలాఫత్ అధికారం ఉస్మాన్ చేతికి రాగానే దైవప్రవక్త[స.అ] ఆదేశాన్ని లెక్కచేయకుండా తన పినతండ్రి హకమ్ ను మదినహ్ కు తిరిగి తీసుకొచ్చారు.[నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, పేజీ140].
రిఫ్రెన్స్
నజరీ మున్ఫరిద్, నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, బున్యాదె మఆరిపె ఇస్లామీ, ఖుమ్, 1381ష.
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya... Jazakallah..
వ్యాఖ్యానించండి