ఇమామ్ హుసైన్[అ.స] పట్ల మర్వాన్ అమర్యద ప్రవర్తన మరియు అతడు వారితో కలిసిన కొన్ని సందర్భాలు.
మదీనా అధికారి అయిన వలీద్ ఇబ్నె ఉత్బా యజీద్ నుండి సమాచారం రాగానే ఇమామ్ హుసైన్[అ.స] ను రాత్రికి రాత్రి యజీద్ తో బైఅత్ విషయాన్ని తెలియపరిచేందుకు, రమ్మని కబురు పెట్టాడు. ఇమామ్ హుసైన్[అ.స] “ఈ బైఅత్ అందరి ముందు జరగాలి” అని అన్నారు. అక్కడే ఉన్న మర్వాన్ ఇబ్నె హకమ్ “అమీర్! అతడి నెపమును అంగీకరించకు, బైఅత చేయకపోతే తల నరికేయి!!!” అన్నాడు. ఇమామ్ హుసైన్[అ.స] “మేము దౌత్యవంశస్తులం, రిసాలత్ యొక్క ఖనులము, మా ఇల్లు దైవదూతల రాకపోకల ప్రదేశం.... యజీద్ దుర్మార్గుడు, త్రాగుబోతు, ఏపాపము ఎరగని అమాయకులను చంపిన హంతకుడు. నాలాంటి వాడు అటువంటి వాడితో బైఅత్ చేయడు” అని అన్నారు. అప్పుడు మర్వాన్ వలీద్ వైపుకు తిరిగి ఇలా అన్నాడు: “నా మాటను వ్యతిరేకించావు” వలీద్ “అలా చేస్తే నా ఇహపరలోకాలూ నాశనం చేసుకున్నట్లే” అని అన్నాడు.
మరుసటి రోజు సాయత్రం ఇమామ్ హుసైన్[అ.స] తన ఇంటి నుండి బయటకు వచ్చారు మధ్యలో మర్వాన్ ను కలిశారు. మర్వాన్ ఇమామ్ తో ఇలా అన్నాడు: “నేను మీ శ్రేయోభిలాషిని, నా మనవిని అంగీకరించండి. ఇమామ్ ఏమిటో చెప్పు అన్నారు. యజీద్ తో బైఅత్ చేయండి మీ ఇహపరలోకాలకూ మంచిది! అని అన్నాడు. ఇమామ్ హుసైన్[అ.స] ఇలా అన్నారు: “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్, యజీద్ లాంటి వాడు ఇస్లాం ఉమ్మత్ పై నాయకుడయ్యాడంటే ఇక ఆ ఇస్లాం నాశనమయ్యినట్లే, నా పితామహులు దైవప్రవక్త[స.అ] ఇలా చెప్పడం విన్నాను: “అబూసుఫ్యాన్ వంశం పై ఖిలాఫత్ అధికారం నిషేదించబడినది”[నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, పేజీ138-139]
రిఫ్రెన్స్
నజరీ మున్ఫరిద్, నామెహా వ ములాఖాత్ హాయె ఇమామ్ హుసైన్, బున్యాదె మఆరిపె ఇస్లామీ, ఖుమ్, 1381ష.
వ్యాఖ్యానించండి