దేవుని సన్నిధిలో స్వీకరింపబడే ప్రార్ధనలు

సోమ, 01/28/2019 - 19:39

ఇమాం సాదిఖ్(అ.స)ల వారి ద్రుష్టిలో స్వీకరింపబడే ప్రార్ధనలు ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

దేవుని సన్నిధిలో స్వీకరింపబడే ప్రార్ధనలు

అందరూ అల్లాహ్ ను ప్రార్థించి వేడుకునే వారే, కానీ అల్లాహ్ ఎవరి ప్రార్థనలను ఆలకిస్తాడో ఎవరికీ తెలియదు. ..ఎవరి ప్రార్ధనలు అల్లాహ్ సన్నిధిలో స్వీకరింపబడతాయో.. అన్న విషయం కొన్ని హదీసులలో వివరించబడి ఉంది. అలాంటి హదీసులలో ఒకటి ఇమాం సాదిఖ్(అ.స)ల వారి ఈ హదీస్ మీ కోసం:
నా తండ్రి ఇమాం బాఖిర్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఐదు రకాల ప్రార్ధనలు అల్లాహ్ సన్నిధిలో తిరస్కరింపబడవు.(అనగా తప్పక స్వీకరింపబడతాయి):
1. న్యాయశీలి అయిన ఇమాం ప్రార్ధన.
2. అన్యాయానికి గురి అయిన వ్యక్తి ప్రార్ధన. అల్లాహ్ ప్రవచనం: నేను ఎలాగైన నీపై దౌర్జన్యం చేసినవానిపై ప్రతీకారం తీర్చుకుంటాను(ఒకవేళ కొంత సమయం పట్టినా సరే).
3. గుణవంతుడైన కుమారుని ప్రార్ధన తన తల్లితండ్రుల కోసం.
4. గుణవంతుడైన తండ్రి ప్రార్ధన తన కుమారుని కోసం.
5. విశ్వాసుని ప్రార్ధన తన మిత్రుడి కోరకు అతడు అక్కడ లేనప్పుడు., అల్లాహ్ ఇలా ఈ విధంగా అనెను: "నీకు కూడా అలాగే జరుగు గాక".

రెఫరెన్స్:
ఉసూలె కాఫి, 4 వ భాగం,పేజీ: 272.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7