“ఓ ప్రభూ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా?” అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన అల్లాహ్.
జీవన్మరణాలను ఇచ్చేవాడు అల్లాహ్ అని ఖుర్ఆన్ మరియు రివాయతులు చెబుతున్నాయి. మనిషిపై విషయాన్ని విని తెలుసుకున్న ప్రభావం కన్న చూసి తెలుసుకున్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లాహ్ మరణించిన తరువాత మనిషిని ఎలా ప్రాణాలు పోస్తాడు అన్న విషయం పై హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] యొక్క ఈ సంఘటను ఖుర్ఆన్ లో ఇలా వివరించాడు:
“ఓ ప్రభూ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా?” అని ఇబ్రాహీం విన్నవించుకున్నప్పుడు, “నీకు నమ్మకం లేదా?” అని దేవుని తరపున సెలవీయబడింది. “ఎందుకు లేదు?!. (నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే) ఆత్మ తృప్తికై ఇలా అడిగాను” అని అతనన్నారు. అప్పుడు అల్లాహ్, “నాలుగు (రకాల) పక్షులను తీసుకో. వాటిని మచ్చిక చేసుకో. (వాటిని కోసి మక్కలు ముక్కలుగా చేయి). తరువాత ఒక్కో పర్వతం పై దాని ఒక్కో(మాంసపు) ముక్కను ఉంచు. ఆపైన వాటిని పిలువు. అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడన్న సందతిని బాగా తెలుసుకో” అని అన్నాడు.[బఖరహ్:260].
వ్యాఖ్యానించండి