ఫిదక్ కానుక అల్లాహ్ ఆజ్ఞానుసారం

బుధ, 01/30/2019 - 16:13

ఫిదక్ తోటను దైవప్రవక్త[స.అ] అల్లాహ్ ఆదేశానుసారం హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ]కు ఇచ్చారు అన్న విషయం పై రివాయత్ నిదర్శనం.

ఫిదక్ కానుక అల్లాహ్ ఆజ్ఞానుసారం

దైవప్రవక్త[స.అ] అల్లాహ్ ఆదేశానుసారం ఫిదక్ భూమిని హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ]కు ఇచ్చారు అని షియా ఉలమాలు నమ్ముతారు. ఇక్కడ ఒక రివాయత్ ను కూడా దానికి నిదర్శనంగా ప్రదర్శించబడుతుంది.
ఇస్రా సూరహ్ 26వ ఆయత్ “కుటుంబీకులకు వారి హక్కును ప్రసాదించండి” అని అవతరించినప్పుడు దైవప్రవక్త[స.అ] జిబ్రయీల్ తో “ఈ కుటుంబీకులెవరు” అని ప్రశ్నించారు. అప్పుడు అల్లాహ్ తరపు నుండి బిబ్రయీల్ “ఫిదక్ ను హజ్రత్ ఫాతెమా[స.అ]కు కానుకగా ప్రసాదించండి” అని సందేశాన్ని తీసుకొచ్చారు. దైవప్రవక్త[స.అ] హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ]ను పిలిచి ఇలా అన్నారు: “నీకు ఫిదక్ ను ఇచ్చేయమని అల్లాహ్ నన్ను ఆదేశించాడు” అప్పుడు హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఆ కానుకను స్వీకరించారు. దైవప్రవక్త[స.అ] ఉన్నంత కాలం అక్కడ హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మనుషులే వాటి బాధ్యతలు నిర్వర్తించేవారు.[ఇస్బాతుల్ హిదాయహ్, భాగం3, పేజీ409].

రిఫ్రెన్స్
హుర్రె ఆములీ, ఇస్బాతుల్ హిదాయహ్, అఅలమీ, 1425హి.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30