ఫిదక్ భూమి దైవప్రవక్త[స.అ] ఆస్తి

బుధ, 01/30/2019 - 16:32

సంధి ద్వార ముస్లిముల చేతికి వచ్చే భూములు కేవలం దైవప్రవక్త[స.అ]కు మాత్రమే సంబంధించినవి, వాటిపై ఎవరికి ఎటువంటి హక్కు లేదు (నిదర్శనం హష్ర్ సూరహ్ 7వ ఆయత్).

ఫిదక్ భూమి దైవప్రవక్త[స.అ] ఆస్తి

హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో ముస్లిములు యూదులతో యుద్ధం చేసి “ఖైబర్” కోటను దక్కించుకున్నారు. దాంతో యూదుల కేంద్ర బలం తగ్గింది. ఫిదక్ లో ఉన్న యూదులు సంధికోసం దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చారు. వారు తమ భూమిలో సగభాగాన్ని ఉంచుకొని మిగత సగం భూమీ దైవప్రవక్త[స.అ]కు ఇచ్చేశారు. ఆ తరువాత వారు దైవప్రవక్త[స.అ] తో “వారి భూములను కూడా వాళ్ళకే కౌలుకు ఇవ్వమని” కోరారు. దైవప్రవక్త[స.అ] వారి ఒప్పందాన్ని అంగీకరించారు. యుద్ధం చేయకుండా సంధి ద్వార ముస్లిముల చేతికి వచ్చే భూములు కేవలం దైవప్రవక్త[స.అ]కు మాత్రమే సంబంధించినవి, వాటిపై ఎవరికి ఎటువంటి హక్కు లేదు(ఈ మాటకు నిదర్శనం ఖుర్ఆన్ యొక్క హష్ర్ సూరహ్ 7వ ఆయత్). ఫిదక్ కూడా ఆ విధంగానే ముస్లిముల చేతికి వచ్చిన భూమి. ప్రముఖ చరిత్రకారుడైన తబరీ తన గ్రంథం “తారీఖె తబరీ”లో “నిస్సందేహముగా ఫిదక్ దైవప్రవక్త[స.అ] యొక్క ఆస్తి; ఎందుకంటే ముస్లిములు దానిని సైన్యెం ద్వార తన సొంతం చేసుకోలేదు”[తారీఖె తబరీ, భాగం2, పేజీ302]. ఇస్రా సూరహ్ యొక్క 26వ ఆయత్ అవతరించడంతో దైవప్రవక్త[స.అ] తన కూతురిని పిలిచి ఫిదక్ భూమిని కానుకగా ఇచ్చేశారు.[మజ్ముఅల్ బయాన్, భాగం3, పేజీ411].
ఫిదక్ భూమిని దైవప్రవక్త[స.అ] తమ కుమార్తెకు ఇచ్చారు అన్న విషయాన్ని అహ్లె సున్నత్ ఉలమాలు తమ గ్రంథాలలో ఉల్లేఖించారు, ఉదా: అబూ సయీదే ఖుద్రీ, హాకిమె నైషాపూరీ మొ..

రిఫ్రెన్స్
తబరీ, తారీఖె తబరీ మరియు మజ్ముఅల్ బయాన్.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20